Villain Sampath Raj Sweet Warning to Trivikram - Sakshi
Sakshi News home page

Sampath Raj: నాన్నే ఇంటి నుంచి పారిపోమ‌న్నాడు:  మిర్చి విల‌న్‌

Published Wed, Jan 26 2022 10:58 AM | Last Updated on Wed, Jan 26 2022 12:59 PM

Villain Sampath Raj Sweet Warning To Trivikram - Sakshi

సంప‌త్ రాజ్‌.. 'మిర్చి' సినిమాతో విల‌న్‌గా పాపుల‌ర్ అయ్యాడీ న‌టుడు. 'మిర్చి' త‌ర్వాత ఎన్నో విభిన్న పాత్ర‌లు చేస్తూ టాలీవుడ్‌లో టాప్ విల‌న్‌గా పేరు గ‌డించిన సంప‌త్ తాజాగా ఓ షోలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. ముందుగా త‌న కుటుంబం గురించి చెప్తూ.. 'మా నాన్న పెళ్లిచూపుల కోసం యూనిఫామ్‌లో వెళ్లిన‌ప్పుడు అమ్మ ఇల్లు కడుగుతోంద‌ట‌. ఆమెను చూసి ఎవ‌రో ప‌నిమ‌నిషి అనుకున్నాడ‌ట‌. ఆయ‌న్ను చూడ‌గానే అమ్మ ప‌రుగెత్తుకుంటూ లోప‌ల‌కు వెళ్లి పోలీసులొచ్చార‌ని చెప్పింది. అలా వాళ్ల మొద‌టి ప‌రిచ‌యం జ‌రిగింది. మా పేరెంట్స్‌కు మేము ఏడుగురం సంతానం. అందులో నేను ఆఖ‌రివాడిని' అని చెప్పుకొచ్చాడు.

ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇవ్వ‌క‌పోతే లొకేష‌న్‌కు వ‌చ్చి కెమెరా ఎత్తుకెళ్లిపోతాన‌ని ఓ డైరెక్ట‌ర్‌ను స‌ర‌దాగా బెదిరించాన‌ని చెప్పుకొచ్చాడు. ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే ఆ డైరెక్ట‌ర్ మ‌రెవ‌రో కాదు త్రివిక్ర‌మ్ అని అర్థ‌మ‌వుతోంది. ఆ ద‌ర్శ‌కుడు ఎక్కడుంటాడ‌ని సునీల్‌ను ఆరా తీయ‌గా ఆయ‌న‌కో ఆఫీసు ఉంద‌ని, అక్క‌డికి వెళ్ల‌మ‌ని సూచించాడ‌ని పేర్కొన్నాడు. 100% ఆయ‌న‌ను అటాక్ చేస్తాన‌ని స‌ర‌దాగా చెప్పుకొచ్చాడు. ఆర్టిస్టు శ‌ర‌ణ్య‌, ఆమె ఫ్యామిలీ.. త‌న‌కు, త‌న కుటుంబానికి చాలా క్లోజ్ అన్న సంప‌త్‌ ఆమెతో క‌లిసి ఒక సినిమాలో న‌టించాన‌ని తెలిపాడు. అయితే ఆ మాత్రం దానికే ఆమెను త‌న‌ మాజీ భార్యగా పేర్కొంటూ అస‌త్య‌పు వార్త‌లు రాశార‌ని, అందులో ఎలాంటి నిజం లేద‌ని చెప్పుకొచ్చాడు. త‌న‌ త‌ల్లికి సినిమాలంటే ఇష్టం లేక‌పోవ‌డంతో తండ్రే ఇంటి నుంచి పారిపోమ‌ని స‌ల‌హా ఇచ్చార‌ని తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement