తెలంగాణ ఏర్పాటులో బీజేపీదే కీలకపాత్ర
Published Mon, Oct 7 2013 2:49 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
లింగాలఘణపురం, న్యూస్‌లైన్ : ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీదే కీలకపాత్ర’ అని బీజేపీ శాసనసభ పక్షనేత యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో మద్యం మహమ్మారిని తరిమి కొడుదాం అనే నినాదంతో జరిగిన బహిరంగ సభలో లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు ప్రేమేందర్‌రెడ్డి, రామగల్ల పరమేశ్వర్, బీజేపీ లీగల్‌సెల్ రాష్ట్ర నాయకుడు చిలుక విజయరావు హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా నెల్లుట్లలోని శ్రీకాంతాచారి విగ్రహానికి లక్ష్మీనారాయణ నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీజేపీ లీగల సెల్ రాష్ట్ర నాయకుడు విజయరావు మాట్లాడారు. ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయని పక్షంలో ఇక్కడి ప్రజల పక్షాన తాను పోరాడుతానని సుష్మస్వరాజ్ చెప్పారని, మరుసటి రోజునే బీజేపీ తెలంగాణ రాష్ట్రంపై కేబినెట్‌లో నోట్ పెట్టి ఆమోదం తెలిపిందన్నారు. వేలాది మంది త్యాగాల ఫలితం, ప్రతి అక్క, అన్న, తమ్ముడు, చెల్లి రోడ్లపై చేపట్టిన నిరసన కార్యక్రమాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందన్నారు.
Advertisement
Advertisement