పోలీసు డ్రస్లో మెరవనున్న తాప్సీ | Taapsee Pannu to don khaki in Selvaraghavan's 'Kaan' | Sakshi
Sakshi News home page

పోలీసు డ్రస్లో మెరవనున్న తాప్సీ

Published Wed, May 27 2015 2:38 PM | Last Updated on Tue, Aug 21 2018 7:34 PM

పోలీసు డ్రస్లో మెరవనున్న తాప్సీ - Sakshi

పోలీసు డ్రస్లో మెరవనున్న తాప్సీ

తమిళంలో హర్రర్ కామెడీ సినిమా 'గంగ' విజయంతో మంచి ఊపుమీదున్న హీరోయిన్ తాప్సీ పన్ను.. తన కెరీర్లోనే తొలిసారిగా పోలీసు డ్రస్ ధరించనుంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రానున్న తమిళ యాక్షన్ సినిమా 'కాన్'లో ఆమె పోలీసు పాత్ర పోషిస్తోందట. తన చేతిలో ప్రస్తుతం రెండు తమిళ సినిమాలున్నాయని, రెండూ పూర్తిగా విభిన్నమైనవని తాప్సీ చెప్పింది. ఒక సినిమా పూర్తి ఫ్యామిలీ డ్రామా అని, అందులో తాను కుంభకోణం నుంచి వచ్చిన సాధారణ అమ్మాయి పాత్ర పోషిస్తానని, రెండో దాంట్లో మాత్రం ఒక మిషన్లో పాల్గొనే మహిళా పోలీసు అధికారిణి పాత్ర పోషిస్తానని తెలిపింది.

తిరు దర్శకత్వంలో తాను తమిళసెల్వి పాత్ర పోషిస్తున్నట్లు గతంలో ఆమె ట్విట్టర్ ద్వారా చెప్పింది. ఇక సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న 'కాన్' సినిమాలో శింబు సరసన తాప్సీ నటిస్తోంది. ఈ సినిమాలో కేథరీనా ట్రెసా మరో ముఖ్యపాత్ర పోషిస్తోంది. కాన్ అంటే తమిళంలో అడవి అని అర్థం. ఈ సినిమాలో ముఖ్యమైన సీన్లన్నింటినీ అడవిలోనే చిత్రీకరించారు. ఈ సినిమాలో శింబు అయ్యప్ప భక్తుడి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement