అతడిని నమ్మి తప్పు చేశా? | I did blunder mistake believe him, says Tapsee | Sakshi
Sakshi News home page

అతడిని నమ్మి తప్పు చేశా?

Published Thu, Jan 29 2015 1:00 AM | Last Updated on Fri, Jul 12 2019 3:07 PM

అతడిని నమ్మి తప్పు చేశా? - Sakshi

అతడిని నమ్మి తప్పు చేశా?

ఒక అతడిని నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పు అంటూ నటి తాప్సీ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. తమిళు, తెలుగు, హిందీ తదితర భాషల్లో నటిగా గుర్తింపు పొందిన తాప్సీ  ఊహించని స్థాయికి చేరుకోలేక పోయింది. అయితే, తనకంటూ ఓ రోజు వస్తుందన్న ఆశతో ఎదురు చూస్తోంది. ప్రతి మనిషికి జీవితంలో ఒక చేదు అనుభవం ఉంటుంది. తాప్సీకి కూడా అలాంటి అనుభవాలు చవి చూసిందట. వద్దు అనుకున్నా, గుర్తుకు వస్తున్న ఆ సంఘటన గురించి ఆమె చెబుతూ, తన తండ్రి రియల్ ఎస్టేట్ సంస్థలో ఓ చిరు ఉద్యోగి అని చెప్పింది.
 
 రాత్రి వేళ తన స్నేహితుల ఇంట ఉండడానికి కూడా అంగీకరించే వారు కారని తెలిపింది. అలాంటి పరిస్థితుల్లో తాను ఒక చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఒంటరిగా ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. అప్పుడు తనపై ప్రేమాభిమానాలు కురిపించిన వాళ్లను ఎక్కువగా నమ్మినట్టు పేర్కొంది. ఒకరితో సన్నిహితంగా మెలిగానని, అది తాను చేసిన పెద్ద తప్పు అని ఆవేదన వ్యక్తం చేసింది. అతడితో ప్రేమ బ్రేక్ అయిందని తెలిపింది. అయితే, ఆ బాధ ఒక వారం వరకే ఉందని అందింది. ఒక నటుడుకి నటికి మధ్య అనుబంధం నిరంతరం సాగుతుందని చెప్పలేమంది. ఇంతకీ ప్రేమ బ్రేక్ అయిందన్న తాప్సీ బాయ్ ఫ్రెండ్‌తోనా లేదా మరెవ్వరితోనా? అన్నది తేల్చక పోవడం చర్చకు దారి తీసింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement