అమితాబ్‌తో... | Tapsee acted with amitabh | Sakshi
Sakshi News home page

అమితాబ్‌తో...

Published Mon, Jan 11 2016 11:52 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

అమితాబ్‌తో... - Sakshi

అమితాబ్‌తో...

‘ఝమ్మంది నాదం’, ‘మొగుడు’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘సాహసం’ తదితర చిత్రాల్లో నటించిన తాప్సీకి ఎందుకనో టాలీవుడ్ పెద్దగా కలిసి రాలేదు. బాలీవుడ్‌లో మాత్రం ఆమె హ్యాపీ. అక్షయ్‌కుమార్‌తో నటించిన ‘బేబీ’ ఆమె జాతకాన్నే మార్చేసింది. గ్లామరస్‌గా కనిపించడమే  కాక పోరాట ఘట్టాల్లోనూ ఆమె సత్తా చాటారు. కాగా, ఈ మధ్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఏ భామకూ దక్కని ఓ గోల్డెన్ ఆఫర్ తాప్సీని వరించింది. అమితాబ్ నటించనున్న ఓ చిత్రంలో కీలక పాత్ర చేసే అవకాశం కొట్టేశారు తాప్సీ. అనిరుధ్ రాయ్ దర్శకత్వంలో శూజిత్ సర్కార్ నిర్మించే ఈ యాక్షన్ థ్రిల్లర్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement