ఎస్‌ 4 | Sai Pallavi in Suriya's film with Selvaraghavan | Sakshi
Sakshi News home page

ఎస్‌ 4

Published Thu, Dec 21 2017 1:30 AM | Last Updated on Thu, Dec 21 2017 1:30 AM

Sai Pallavi in Suriya's film with Selvaraghavan  - Sakshi

... హెడ్డింగ్‌ చదవగానే సూర్య ‘సింగమ్‌ 4’ సినిమా చేయబోతున్నారనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఈ ఎస్‌ 4 వేరు. ఒక క్రేజీ సినిమా కోసం నాలుగు ‘ఎస్‌’లు కలిశాయి. ఒక ఎస్‌ సూర్య అని ఇంకో ఎస్‌ సాయి పల్లవి అని ఫొటోలు చూసి, ఊహించే ఉంటారు. మరో రెండు ఎస్‌లు ఎవరంటే సెల్వరాఘన్, యస్‌. ఆర్‌. ప్రభు. ‘7/జి బృందావన కాలనీ’ ఫేమ్‌ సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సూర్య గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో సాయి పల్లవిని కథానాయికగా తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించబోతున్న నిర్మాత యస్‌. ఆర్‌. ప్రభు. అలా నాలుగు ఎస్‌లు కలసి ఓ ‘ఎస్‌’ ఇవ్వడానికి ఫిక్స్‌ అయ్యారు. అదేనండీ.. ఎస్‌ ఫర్‌ సక్సెస్‌ కదా. 2018 దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement