హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్
హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ సూర్యకు జంటగా ఎన్‌జీకె చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. ఈ చిత్రానికి సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నాకు చాలా స్పెషల్ అని ఈ బ్యూటీ చెప్పింది. డైరెక్టర్ సెల్వరాఘవన్ కథలో నటించడం రెండోసారని రకుల్ తెలిపింది. రకుల్ ప్రీత్‌సింగ్ బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన భామ. కోలీవుడ్‌లో రంగప్రవేశం చేసి పుత్తగం, ఎన్నమో ఏదో, తడయార తాక్క వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆ భామ టాలీవుడ్‌లో అడుగు పెట్టింది.
కోలీవుడ్‌లో కార్తీకి జంటగా నటించిన ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం సక్సెస్ కావడంతో రకుల్‌ను దక్షిణాదిలో నిలబడింది. ప్రస్తుతం సూర్యతో నటిస్తున్న ఎన్‌జీకే చిత్రంపై రకుల్‌ప్రీత్‌సింగ్ చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే తదుపరి కార్తీతో, శివకార్తికేయన్‌లతో నటించే అవకాశాలపై ఎన్‌జీకే చిత్రం ప్రభావం చాలా ఉంటుంది. అందుకే రకుల్ ఈ చిత్రం తనకు చాలా స్పెషల్ అంటోంది.
దర్శకుడు సెల్వరాఘవన్ ఎన్‌జీకే చిత్రంలో తన పాత్రకు చాలా ప్రాముఖ్యతను కల్పించారని ఆమె చెప్పింది. ఇప్పటి వరకూ తాను నటించిన వైవిధ్యభరిత కథా పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నానని చెప్పుకొచ్చింది. తాను దక్షిణాదిలో తెలుగు తమిళ భాషల్లో కంటే ముందు కన్నడంలో నటించానని తెలిపింది. తమిళంలో సెల్వరాఘవన్ తెరకెక్కించిన 7జీ రెయిన్‌బో కాలనీ కన్నడ వెర్షన్‌లో హీరోయిన్‌గా పరిచయమైనట్లు ఈ భామ తెలిపింది. సెల్వరాఘవన్ చిత్రాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత ఉంటుందని, అదే విధంగా ఎన్‌జీకే చిత్రంలోనూ తన పాత్ర చెప్పుకునే విధంగా ఉంటుందని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment