సూర్య
సూర్య లేటెస్ట్ సినిమా ‘యన్‌జీకే’ షూటింగ్ పూర్తయింది. కొన్ని నెలలుగా తనతో పాటు సినిమా అద్భుతంగా రావడానికి కృషి చేసిన టీమ్ అందర్నీ అభినందించాలని భావించారు సూర్య. ఈ సినిమాకు పని చేసిన దాదాపు 120 మందికి గోల్డ్ కాయిన్స్‌ను బహుమతిగా అందించారు. దాంతో ‘మీ మనసు బంగారం’ అని సూర్యకు కితాబులు ఇస్తోంది కోలీవుడ్. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య, సాయి పల్లవి జంటగా యస్‌ఆర్ ప్రభు నిర్మించిన చిత్రం ‘యన్‌జీకే’ (నంద గోపాల కుమార్). పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment