సూర్యతో జోడీ కుదిరింది | Rakul Preet Singh, Sai Pallavi on board for Suriya 36! | Sakshi
Sakshi News home page

సూర్యతో జోడీ కుదిరింది

Published Sat, Jan 6 2018 12:22 AM | Last Updated on Sat, Jan 6 2018 12:22 AM

Rakul Preet Singh, Sai Pallavi on board for Suriya 36! - Sakshi

ప్రస్తుతం ముంబైలో బిజీగా ఉన్నారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఏం చేస్తున్నారంటే ఈ నెల 26న రిలీజ్‌ కానున్న హిందీ సినిమా ‘అయ్యారీ’ని ప్రమోట్‌ చేస్తున్నారామె. సిద్ధార్థ్‌ మల్హోత్రా, మనోజ్‌ బాజ్‌పేయి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ లీడ్‌ రోల్స్‌ చేసిన ఈ సినిమాకు నీరజ్‌ పాండే దర్శకుడు. ‘అయ్యారీ’ రిలీజ్‌ తర్వాత.. రకుల్‌ నెక్ట్స్‌ ఏంటీ? అంటే.. ఆ విషయం గురించే ఇప్పుడు చెన్నై కోడంబాక్కమ్‌ వర్గాల్లో ఓ హాట్‌ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది.

సింగమ్‌.. అదేనండీ సూర్య సరసన రకుల్‌ చాన్స్‌ కొట్టేశారట. సూర్య హీరోగా సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో ముందు సాయి పల్లవిని హీరోయిన్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే స్క్రిప్ట్‌ పరంగా మరో హీరోయిన్‌కు చాన్స్‌ ఉండటంతో రకుల్‌ను  కన్ఫార్మ్‌ చేశారట. ఈ సంగతి ఇలా ఉంచితే.

సూర్య తమ్ముడు
 కార్తీ సరసన ఆల్రెడీ ‘ఖాకీ’లో నటించిన రకుల్‌ నెక్ట్స్‌ మరో మూవీ లో కూడా చేయ నున్నారు. సో.. అన్నదమ్ముల సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా ఉండబోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement