I'm Not Died Or Retired: Director-Actor Selvaraghavan Fiery Replies To A Fan; Here's Why - Sakshi
Sakshi News home page

Selvaraghavan: నేను చనిపోలేదు, జస్ట్‌ బ్రేక్‌ తీసుకున్నానంతే..

Published Fri, May 5 2023 9:26 AM | Last Updated on Fri, May 5 2023 10:19 AM

Selvaraghavan: Iam Not Died Or Retired - Sakshi

ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు సెల్వ రాఘవన్‌ అందరికీ సుపరిచితులే. 'తుళ్లువదో ఇలమై' సినిమాతో దర్శకుడిగా కెరీర్‌ ఆరంభించాడు సెల్వరాఘవన్‌. ఇందులో ఆయన సొంత సోదరుడు ధనుష్‌ హీరోగా చేశాడు. మరోసారి ధనుష్‌ను హీరోగా పెట్టి 'కాదల్‌ కొండై' తెరకెక్కించాడు. ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. అక్కడి నుంచి వరుసగా ప్రేమకథలు తీసుకుంటూ పోయిన ఆయన ఎన్నో హిట్స్‌ అందుకున్నాడు. తర్వాత నటనా రంగంలోనూ అడుగుపెట్టి అక్కడ కూడా తన సత్తా నిరూపించుకున్నాడు.

తాజాగా ఓ నెటిజన్‌ సెల్వ రాఘవన్‌ గురించి పొగుడుతూనే ఆయన ఇక లేరన్నట్లుగా ట్వీట్‌ చేశాడు. 'ఆయన సినిమాలు తీయడం ఆపేసినట్లున్నారు, లేదంటే చనిపోయారేమో' అని ట్వీట్‌ చేశాడు. దీనికి సెల్వ రాఘవన్‌ ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. 'ఎందుకలా అన్నావు మిత్రమా? నేను చనిపోలేదు, అలా అని సినిమాలు తీయడం అపలేదు. ఏదో నా కోసం నేను కొంత సమయం తీసుకుంటూ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నానంతే! నేను ఇంకా నలభైల్లోనే ఉన్నాను. ‍త్వరలోనే మంచి సినిమాలతో ముందుకు వస్తాను' అని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సెల్వ రాఘవన్‌ తెలుగులో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో గుర్తింపు పొందాడు. ఆయన చివరగా కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిన్ని చిత్రంలో నటించాడు. ప్రస్తుతం యోగి బాబు, సునీల్‌ నటిస్తున్న ఓ సినిమాలోనూ ఆయన యాక్ట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలో ఆయన తెరకెక్కించిన హిట్‌ చిత్రాల్లో 7/G బృందావన కాలనీ ఒకటి. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్‌ తీయనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమో చూడాలి!

చదవండి: శరత్‌బాబు ఆరోగ్యంపై వదంతులు సృష్టిస్తే కేసు

సినిమాల్లోకి రావాలన్న ఇంట్రస్టే లేకుండే: త్రిష

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement