శింబుతో రొమాన్స్‌కు ఓకే | Madras' Heroine Catherine Tresa Replaces Trisha in Simbu Starrer Selvaraghavan Movie | Sakshi
Sakshi News home page

శింబుతో రొమాన్స్‌కు ఓకే

Published Wed, May 13 2015 3:14 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

శింబుతో రొమాన్స్‌కు ఓకే

శింబుతో రొమాన్స్‌కు ఓకే

ప్రేమించిన నటిని వదిలేసి వెళ్లడం,  అలాగే తన సరసన నటించడానికి ముందుకొచ్చిన ఒక నటి ఆ తరువాత చిత్రం నుంచి వైదొలగడం, రెండేళ్లుగా సినిమాలు లేకపోవడం లాంటి కారణాలతో బాధలో ఉన్న నటుడు శింబుతో చిత్రంలో రొమాన్స్ చేయడానికి హీరోయిన్ ఓకే అన్నారు. సంచలన నటి త్రిష ఇటీవల వరుసగా రెండు చిత్రాల నుంచి వైదొలిగారు. అందులో నటుడు శింబు చిత్రం ఒకటి.

దాదాపు రెండేళ్ల తరువాత దర్శకుడు సెల్వరాఘవన్ మెగాఫోన్ ఇంచుమించు అదేగ్యాప్ తరువాత శింబు ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. వీరిద్దరూ కలసి చేయనున్న చిత్రంలో నటి త్రిష హీరోయిన్‌గా ఎంపికయ్యారు. నా ఫేవరేట్ దర్శకుడు సెల్వరాఘవన్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. అలాంటిది చిత్ర ప్రారంభానికి సన్నాహాలు జరుగుతుండగా ఈ చిత్రం చేయడం లేదంటూ తప్పుకున్నారు.

దీంతో శింబుకు హీరోయిన్ వేట మళ్లీ మొదలైంది. అలా త్రిష పాత్రలో నటించే లక్కీచాన్స్ నటి క్యాథరిన్ ట్రెసా తలుపుతట్టింది. ఆ మోడ్రన్ చిత్రం ఫేమ్ బ్యూటీ ఆ చిత్రం విజయం సాధించినా తదుపరి అవకాశం లేదన్న బాధలో ఉన్న క్యాథరిన్ ట్రెసాకు లడ్డులాంటి అవకాశం శింబుతో కలిసి నటించడం, దీంతో వెంటనే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారని సమాచారం. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటి తాప్సీ నటించనున్నారు. చిత్ర షూటింగ్ త్వరలో సెట్‌పైకి రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement