
సెల్వరాఘవన్-ధనుష్
ప్రముఖ కోలీవుడ్ యువ నటుడు ధనుష్ తన అన్నయ్య సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు. ధనుష్కు అన్న సెల్వరాఘవన్ అంటే చాలా ఇష్టం. గౌరవం కూడా. ధనుష్ ప్రస్తుతం కథానాయకుడిగా, నిర్మాతగా విజయాల బాటలో దూసుకుపోతున్నారు. తన ఉండర్ బార్ ఫిలింస్ పతాకంపై తానే హీరోగా నటించి, నిర్మించిన 'వేలై ఇల్లా పట్టాదారి' మంచి విజయాన్ని సాధించింది. అయితే సెల్వరాఘవన్‌కు ఈ మధ్య సరైన విజయాలు లేవు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం 'ఇరండామ్ ఉలగం' చాలా నిరాశపరిచింది. దీంతో ఆయన దర్శకత్వం వహించవలసిన ఒకటి, రెండు చిత్రాలు ఆగిపోయాయి.
ఈ పరిస్థితులలో అన్నయ్య దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి ధనుష్ సిద్ధం అవుతున్నారన్నది తాజా వార్త. ఇంతకుముందు కాదల్ కొండేన్, 7జి రెయిన్ బో కాలనీ, పుదుపేటైట వంటి చిత్రాలకు సెల్వరాఘవన్‌తో పని చేసిన సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, ఛాయా గ్రాహకుడు అరవింద్ కృష్ణలు ఈ చిత్రానికి చేతులు కలపనున్నారని సమాచారం. ఈ బంధమే ధనుష్ ఉండర్‌బార్ ఫిలింస్ ద్వారా మళ్లీ త్వరలో రానున్నామంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
**