బతుకుబండి భారమై డ్రైవర్‌గా మారిన ఒకప్పటి హీరో? | Is Selvaraghavan First Hero Sudeep Sarangi Working as a Taxi Driver? | Sakshi
Sakshi News home page

Sudeep Sarangi: కుటుంబ పోషణ భారమై డ్రైవర్‌గా మారిన హీరో? నిజమేంటంటే?

Published Sat, Jun 10 2023 1:00 PM | Last Updated on Sat, Jun 10 2023 1:55 PM

Is Selvaraghavan First Hero Sudeep Sarangi Working as a Taxi Driver? - Sakshi

సినిమా అనేది రంగుల ప్రపంచమే కానీ ఇందులో ఉన్న అందరి జీవితాలు కలర్‌ఫుల్‌గా ఉంటాయనుకుంటే పొరపాటే! అవకాశాలు ఉన్నన్నాళ్లు నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చు. అదే అవకాశాలు రాకుండా పోతే ఎంత స్టార్‌గా వెలుగొందినా మళ్లీ నేలమీదకు రావాల్సిందే! కోలీవుడ్‌లో హీరోగా రాణించిన సుదీప్‌ సారంగి డ్రైవర్‌గా మారి కుటుంబాన్ని పోషిస్తున్నాడంటూ సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది.

ధనుష్‌ సోదరుడు సెల్వరాఘవన్‌ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తొలి సినిమా కాదల్‌ కొండేన్‌. నిజానికి దీనికంటే ముందు 'తుళ్లువదో ఇలమై' అనే సినిమాకు డైరెక్షన్‌ చేసినప్పటికీ ఆ క్రెడిట్‌ అంతా తన తండ్రి కస్తూరి రాజాకే వెళ్లిపోయింది. ఇకపోతే 2003లో వచ్చిన కాదల్‌ కొండేన్‌ చిత్రంలో ధనుష్‌ సైకో కిల్లర్‌గా నటించాడు. సోనియా అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. సుదీప్‌ సారంగి హీరోగా చేశాడు. ఈ ముగ్గురికీ ఇదే తొలి సినిమా కావడం విశేషం. ధనుష్‌, సోనియాలకు ఈ సినిమా తర్వాత మంచి ఆఫర్లు రావడంతో వారి దశ తిరిగిపోయింది. సుదీప్‌ కూడా పలు తమిళ, బెంగాలీ, హిందీ సినిమాలు ఆ తర్వాత సీరియల్స్‌ చేశాడు. కానీ హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు.

తాజాగా అతడు ఖాకీ డ్రెస్‌లో ఉన్న ఓ ఫోటో వైరల్‌ కావడంతో క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడని అంతా అనుకున్నారు. దీంతో ఈ పుకార్లకు చెక్‌ పెడుతూ అసలు విషయం చెప్పాడు సుదీప్‌. తాను బ్యాంక్‌ ప్రకటన కోసం అలా రెడీ అయ్యానని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులలో నటిస్తున్నానని, కుటుంబ పోషణ భారంగా మారిన దుస్థితికి తానింకా రాలేదని వెల్లడించాడు.

చదవండి: ప్రేమ అప్పుడే పుట్టింది.. శాశ్వతంగా ఉండిపోతుంది: లావణ్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement