పదేళ్ల తర్వాత అతని ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన త్రిష! | Trisha Responds To Selvaraghavan's 10-Year-Old Tweet | Sakshi
Sakshi News home page

నేను రెడీ.. పదేళ్ల తర్వాత అతని ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన త్రిష!

Sep 12 2023 10:26 AM | Updated on Sep 12 2023 10:46 AM

Trisha Responds To Selvaraghavan Tweet After 10 Year Old - Sakshi

తమిళ సినిమా: చెన్నై బ్యూటీ త్రిష సినీ కెరీర్‌ ఎత్తు పల్లాలుగానే సాగిందని చెప్పాలి. తెలుగు, తమిళం భాషల్లో అగ్ర కథానాయికగా రాణించిన త్రిష మలయాళం, కన్నడం, హిందీ భాషల్లోనూ నటించి గుర్తింపు పొందారు. అయితే మధ్యలో అపజయాలు ఎదురుకావడంతో అవకాశాలు సన్నగిల్లాయి. మరోపక్క ప్రేమ, పెళ్లి, వ్యక్తిగత సమస్యలు ఈమె సినిమాలపై ప్రభావం చూపించాయని చెప్పవచ్చు. ముఖ్యంగా త్రిష నటించిన హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి.

ఇలాంటి సమయంలో దర్శకుడు మణిరత్నం కమ్‌ బ్యాక్‌ ఇచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన పొన్నియిన్‌ సెల్వన్‌ పార్టు 1, పార్టు 2 చిత్రాల్లో యువరాణి కుందవై పాత్రలో త్రిష ఎంతో హుందాతనంగా నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆ తర్వాత ఈమె రేంజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం విజయ్‌ సరసన ఓ చిత్రంలో నటించిన త్రిష తదుపరి అజిత్‌తో జతకట్టనున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాగా ఈమె సోలో హీరోయిన్‌గా  ప్రధాన పాత్రలో నటించిన ది రోడ్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.

ఇకపోతే  టాలీవుడ్‌ స్టార్‌ వెంకటేష్‌ సరసన ఈమె నటించిన తెలుగు చిత్రం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి సెల్వరాఘవన్‌ దర్శకుడు అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటుడు వెంకటేశ్‌, త్రిషలతో కలిసి పనిచేసిన కాలాన్ని మరచిపోలేమని, ఈ చిత్రానికి సీక్వెల్‌ చేయాలని కోరుకుంటున్నట్లు దర్శకుడు సెల్వరాఘవన్‌ 2013లో ట్విట్టర్‌ ద్వారా త్రిషకు చెప్పారు. దానిపై స్పందించడానికి ఆమెకు దశాబ్దం కాలం పట్టింది. దర్శకుడు సెల్వరాఘవన్‌ ట్వీట్‌కు నటి త్రిష ఇప్పుడు బదిలిస్తూ నేను రెడీ అని పేర్కొన్నారు. మరి సెల్వ రాఘవన్‌ ఇందుకు సిద్ధమవుతారా అన్నది వేచి చూడాల్సిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement