సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య | Surya in Selvaraghavan direction | Sakshi
Sakshi News home page

సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య

Published Sat, Nov 19 2016 1:28 AM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య

సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య

స్టార్ నటుడు సూర్య వేగాన్ని పెంచారు. 24 చిత్రం అందించిన విజయం జోష్‌లో ఉన్న ఈయన ఇప్పుడు వరుస పెట్టి చిత్రాలు చేసేయడానికి సిద్ధం అయ్యారు. సూర్య నటిస్తున్న తాజా చిత్రం ఎస్-3 చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. డి సెంబర్ 16న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో సూర్య యువ దర్శకుడు విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. తానాచేర్న్‌ద కూటం పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం శుక్రవారం షూటింగ్ పట్టాలెక్కింది. ఇందులో సూర్యతో కీర్తీసురేశ్ రొమాన్‌‌స చేయనున్నారు. సూర్య ఆ తరువాత చిత్రానికి కూడా పచ్చజెండా ఊపారు.

ఇది ఈయన 36వ చిత్రం అవుతుంది. దీనికి సంచలన దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించనున్నారన్నది తాజా వార్త. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. మాస్ హీరో, క్లాసికల్ దర్శకుడు కలరుుక లో రూపొందనున్న ఈ చిత్రంపై కచ్చితం గా అంచనాలు భారీ స్థారుులోనే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదనుకుంటా. ఈ క్రేజీ చిత్రాన్ని ఇంతకు ముందు కాష్మోరా వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్నట్లు అధికారికపూర్వకంగా ప్రకటించారు. ఇక ఇందులో సూర్యకు జంటగా నటించే నాయకి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement