
లిప్ కిస్‌కు ఓకే
టీనగర్: లిప్ కిస్‌కు నటి త్రిష ఓకే అంటోంది. వరుణ్ మణియన్‌తో వివాహ నిశ్చితార్థం రద్దయినట్లు త్రిష గురించిన వార్తలు వెలువడుతున్నా, దీని గురించి నోరు మెదపకుండా కొత్త చిత్రాలకు కాల్షీట్లు ఇవ్వడంలోనే ఆమె బిజీగా ఉన్నారు. భూ లోకం, అప్పాటక్కర్, లయన్ (తెలుగు) చిత్రా ల తర్వాత సెల్వరాఘవన్ దర్శకత్వంలో సింబుతో నటిస్తున్నారు. కమల్ నటిస్తున్న ఓర్ ఇర వు చిత్రంలోనూ నటించనున్నారు.
ఇదివరకే ‘విన్నిల్‌దాండి వరువాయా?’ చిత్రంలో లిప్ టు లిప్ కిస్ ఇచ్చి సింబుతో నటించిన త్రిష సెల్వరాఘవన్ చిత్రంలోను అందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ‘మన్మథ అన్బు’ చిత్రంలో కమలహాసన్‌తో త్రిష నటించినప్పటికీ ఆయనకు జంటగా నటిం చలేదు. ప్రస్తుతం కమల్‌తో నటిస్తున్న చిత్రంలో ఆయనకు జంట గా నటిస్తున్నారు. అందువల్ల ఇక్కడ ముద్దులకు కొదువే ఉండబోదని చిత్రవర్గాలు తెలుపుతున్నాయి. కథ కూడా జేమ్స్‌బాండ్ బాణీలో రూపొందుతున్నందున త్రిషకు గ్లామర్ కాస్ట్యూమ్స్ సిద్ధమవుతున్నాయట.