సెల్వ దర్శకత్వంలో నెంజమ్ మరప్పదిల్లై | Selvaraghavan's next film is titled 'Nenjam Marappathillai | Sakshi
Sakshi News home page

సెల్వ దర్శకత్వంలో నెంజమ్ మరప్పదిల్లై

Published Fri, Jan 29 2016 2:04 AM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

సెల్వ దర్శకత్వంలో నెంజమ్ మరప్పదిల్లై

సెల్వ దర్శకత్వంలో నెంజమ్ మరప్పదిల్లై

 చిన్న గ్యాప్ తరువాత సెల్వరాఘవన్ మళ్లీ మెగాఫోన్ పట్టారు. నెంజమ్ మరప్పదిల్లై చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే దీన్ని ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ సంస్థ అధినేత పి.మదన్ సమర్పణలో కలో స్టూడియోస్ ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ నిర్మించడం. ఇక మరో దర్శకుడు ఎస్‌జే సూర్య కథానాయకుడిగా నటిస్తుండగా, ఆయనకు జంటగా అందాల భామ రెజీనా కోలీవుడ్‌లో రీఎంట్రీ అవుతున్నారు.
 
  కాగా ఈ చిత్రం గురువారం ఉదయం తిరువాన్మియూర్ లోని ఒక బంగ్లాలో నిడాంబరంగా ప్రారంభమైంది. సాధారణంగా సెల్వరాఘవన్ చిత్రాల నిర్మాణం అధిక రోజులు జరుగుపుకుంటుండడం పరిపాటి. అయితే ఈ చిత్రాన్ని నేటి నుంచి కంటిన్యూగా చిత్రీకరించి మార్చి నెలకంతా పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. నెంజమ్ మరప్పదిల్లై విభిన్న కథా చిత్రం అనీ ఇది ఏ చిత్రానికీ రీమేక్ కాదనీ దర్శకుడు సెల్వరాఘవన్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement