లవ్ స్టోరీ కాదు | Simbu-Trisha Again In Selvaraghavan's Movie | Sakshi
Sakshi News home page

లవ్ స్టోరీ కాదు

Published Mon, Mar 10 2014 11:17 PM | Last Updated on Sat, Sep 2 2017 4:33 AM

లవ్ స్టోరీ కాదు

లవ్ స్టోరీ కాదు

సంచలన నటుడు శింబు, చెన్నై బ్యూటీ త్రిషది హిట్ పెయిరే. ఈ జంట నటించిన తొలి చిత్రం అలై ఆశించిన విజయం సాధించకపోయినా మలి చిత్రం విన్నైతాండి వరువాయా మంచి విజయాన్నే సాధించింది. ఈ జంట ముచ్చటగా మూడోసారి రొమాన్స్‌కు రెడీ అవుతోంది. విశే షం ఏమిటంటే సంచలన దర్శకుడు సెల్వరాఘవన్ ఈ జంట తో చిత్రం తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. ఇరండాం ఉలగం చిత్రం తరువాత ఈయ న దర్శకత్వం వహించనున్న చిత్రం ఇదే. 
 
 మరో విశేషం ఏమిటంటే మనస్పర్థల కారణంగా విడిపోయిన సెల్వరాఘవన్, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రంతో మళ్లీ కలుస్తున్నారు. ఇది ఫ్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతోంది. దీని గురించి నటుడు శింబు స్పందిస్తూ దర్శకుడు సెల్వరాఘవన్ గత చిత్రాలకు ఇది భిన్నంగా ఉంటుందని తెలిపారు. త్రిష హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా ఉంటుందన్నారు. అయితే ఆ నటి ఎంపిక జరగాల్సి ఉందని చెప్పారు. అదే విధంగా ప్రచారంలో ఉన్నట్లుగా ఇది ప్రేమ కథా చిత్రం కాదని మంచి స్టయిలిష్ యాక్షన్ కథా చిత్రం అని తెలిపారు. ఈ చిత్రాన్ని రడియాన్స్ మీడియా పథకంపై వరుణ్ మణియన్ నిర్మించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement