అందుకే...ఆ సినిమా చేయడంలేదా?! | Reason behind Trisha not acting in Selvaraghavan and Simbu movie | Sakshi
Sakshi News home page

అందుకే...ఆ సినిమా చేయడంలేదా?!

Published Tue, May 12 2015 11:57 PM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

అందుకే...ఆ సినిమా  చేయడంలేదా?!

అందుకే...ఆ సినిమా చేయడంలేదా?!

‘ఎంగేజ్డ్’ స్టేటస్ నుంచి ‘ఐయామ్ సింగిల్’కు మారిన త్రిష ఇప్పుడు సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. కమలహాసన్ సరసన ఓ సినిమాలో నటిస్తున్నారు. అలాగే సుందర్ సి. దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘అరణ్‌మణై-2’లో ఓ కథానాయికగా నటించడానికి కూడా అంగీకరించారు. ఈ రెండు చిత్రాలతో పాటు సెల్వరాఘవన్ దర్శక త్వంలోని చిత్రంలో హీరో శింబు సరసన నటించడానికి ఒప్పుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
 
  అయితే, ఇప్పుడీ సెల్వరాఘవన్ సినిమా నుంచి త్రిష తప్పుకున్నారని చెన్నై టాక్.కమలహాసన్, సుందర్. సి చిత్రాలకు ఎక్కువగా డేట్స్ కేటాయించడం వల్లే ఈ చిత్రం నుంచి తప్పుకున్నారని కొంతమంది అంటున్నారు. కానీ, త్రిష మాజీ ప్రేమికుడు వరుణ్ మణియన్ ఈ చిత్రానికి నిర్మాత కావడం వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలున్నాయి. ఏదైతైనేం.. త్రిష తప్పుకోవడంతో ఆ సినిమా అవకాశం హీరోయిన్ కేథరిన్‌ను వరించిందట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement