సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఇళయదళపతి | Selvaraghavan to direct Ilayathalapathy Vijay's next? | Sakshi
Sakshi News home page

సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఇళయదళపతి

Published Wed, Oct 5 2016 1:45 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఇళయదళపతి

సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఇళయదళపతి

 సంచలన దర్శకుడు సెల్వరాఘవన్, ఇళయదళపతి విజయ్ కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కనుందా? దీనికి కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. విజయ్ ప్రస్తుతం 60వ చిత్రం భైరవాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. తదుపరి అట్లీ దర్శకత్వంలో శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.అదే విధంగా దర్శకుడు సెల్వరాఘవన్ ఎస్‌జే.సూర్య హీరోగా నెంజం మరప్పదిల్లై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
 
 ఇకపోతే ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఇళయదళపతి విజయ్ నటించనున్నారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. శివాజీగణేశన్ కుటుంబసభ్యులు వినాయక చవితిని విశేషంగా జరుపుకుంటారు. ఆ రోజు సన్నిహితులను అన్నైఇల్లం(శివాజీగణేశన్ నివాసం)కు ఆహ్వానించి విందునివ్వడం ఆనవాయితీ. అదే విధంగా ఈ వినాయక చవితి రోజున నటుడు విజయ్ ఆహ్వానించారని తెలిసింది. ఆయన శివాజీగణేశన్ అన్నై ఇల్లంలో జరిగిన వినాయకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారని సమాచారం. అయితే అప్పటికే దర్శకుడు సెల్వరాఘవన్ అన్నై ఇల్లంకు వచ్చారట.
 
  నటుడు ప్రభు విజయ్‌కి సెల్వరాఘవన్‌ను పరిచయం చేసి ఇద్దరినీ ఒక గదిలో కూర్చోపెట్టి దర్శకుడు కథ చెపుతారని అన్నారట. దీంతో సెల్లరాఘవన్ చెప్పిన కథ విజయ్‌కి బాగా నచ్చిందని, అయితే రెండో భాగంలో కొన్ని సూచనలను చెప్పి వాటిని డెవలప్ చేయమని చెప్పినట్లు సమాచారం. విజయ్,సెల్వరాఘవన్ కలిసినట్లు ఆయన తండ్రి కస్తూరిరాజా ధ్రువపరిచారు. దీంతో విజయ్ 62వ చిత్రాన్ని సెల్వరాఘవన్ దర్శకత్వంలో శివాజీ ప్రొడక్షన్ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement