కాక పుట్టిస్తున్న కత్తి | Over 70 screens for Kaththi in the UK | Sakshi
Sakshi News home page

కాక పుట్టిస్తున్న కత్తి

Published Sun, Oct 12 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

కాక పుట్టిస్తున్న కత్తి

కాక పుట్టిస్తున్న కత్తి

 కత్తి చిత్రం కోలీవుడ్‌లో కాక పుట్టిస్తోందనే చెప్పాలి. ఇళయదళపతి విజయ్ నటించిన తాజా చిత్రం కత్తి. ఏఆర్ మురుగదాస్, విజయ్ హీరోగా దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ఇది. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన తుపాకీ బాగా పేలింది. దీంతో కత్తి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో విజయ్ మంచివాడిగా, చెడ్డవాడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారనే విషయం తెలిసిందే. క్రేజీ బ్యూటీ సమంత నాయకి. నిల్‌నితిన్ ముఖేష్ సతీష్, తోటారాయ్ చౌదరి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ పతాకంపై సుభాష్‌కరణ్, కరుణామూర్తిలు నిర్మిస్తున్నారు.
 
 చిత్ర నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 22న తెరపైకి వస్తూ దీపావళికి సందడి చేయనుంది. అనిరుధ్ సంగీత బాణీలు అందించిన ఈ చిత్రం ఆడియో టీజర్ ఇంతకుముందే మార్కెట్‌లోకి విడుదలై మంచి స్పందన పొందాయి. ముఖ్యంగా హీరో విజయ్ పాడిన సెప్ఫా పుళ్ల పాట బాగా ప్రాచుర్యం పొందింది. కాగా చిత్రం మెయిన్ ట్రైలర్ శుక్రవారం సెన్సార్ జరుపుకుని శనివారం థియేటర్‌లో విడుదలైంది. ఇప్పటికే భారీ అంచనాలను నెలకొన్న కత్తిని అత్యధిక థియేటర్లలో విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్క యూకే (యునెటెడ్ కింగ్‌డమ్)లోనే కత్తి చిత్రాన్ని 70 స్క్రీన్స్‌లో ప్రదర్శించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. విజయ్ గత చిత్రాల కంటే అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న చిత్రంగా కత్తి రికార్డు సృష్టించనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement