సెల్వరాఘవన్, సంతానం చిత్రం ప్రారంభం | Selvaraghavan,santanam new movie begin | Sakshi
Sakshi News home page

సెల్వరాఘవన్, సంతానం చిత్రం ప్రారంభం

Published Thu, Dec 8 2016 3:23 AM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM

సెల్వరాఘవన్, సంతానం చిత్రం ప్రారంభం

సెల్వరాఘవన్, సంతానం చిత్రం ప్రారంభం

సంచలన దర్శకుడు సెల్వరాఘవన్, కామెడీ చిత్రాల కథానాయకుడు సంతానం కలరుుకలో చిత్రం ప్రారంభమైంది. వీరి కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కనుందన్న వార్త ప్రచారం అవగానే నిజంగా అది జరిగేనా? అన్న సందేహాలు పరిశ్రమ వర్గాల్లో చాలా మందికి కలిగారుు. కారణం లేకపోలేదు. సెంటిమెంట్‌తో కట్టిపడేసే చిత్రాల దర్శకుడుగా పేరొందిన సెల్వరాఘవన్ హాస్యచిత్రాల నటుడు సంతానం హీరోగా చిత్రం చేయగలరా? అన్నదే వారి సందేహాంగా భావించాలి. అరుుతే అలాంటి వారి సందేహాన్ని పటాపంచలు చేస్తూ ఈ సంచలన కాంబినేషన్‌లో చిత్రం ఆదివారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఎస్‌జే.సూర్య హీరోగా నెంజం మరప్పదిలై చిత్రాన్ని పూర్తి చేసిన సెల్వరాఘవన్ సంతానం కోసమనే ఒక రొమాంటిక్ కామెడీ కథను తయారు చేశారట. ఫిలిం డిపార్ట్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో సంతానంకు జంటగా నటి అదితి నటిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని, లోక్‌నాథ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి బహుళ ప్రాచుర్యం పొందిన పాటలోని పల్లవి అని మన్నవన్ వందానడి పేరును నిర్ణరుుంచినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement