ఖత్రాన్ కి ఖిలాడీ.. ఇదొకరియాలిటీ సో.. ఇందులో పాల్గొనే వారితో రకరకాల స్టంట్లు చేయిస్తారు. వారి భయాల్ని పోగొడుతారు. అన్ని భయాలను దాటుకుని చివరిదాకా నిలబడ్డవారే విజేతగా నిలుస్తారు. ఈ షోను ఆదరించేవారి సంఖ్య ఎక్కువే. అందుకే ఇప్పటివరకు 13 సీజన్లు విజయవంతంగా నడిచాయి. ప్రస్తుతం 14వ సీజన్ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. అయితే ఇప్పటికే కొంత షూటింగ్ జరిగిపోయింది.
నా గురించి నేను తెలుసుకున్నా
దాని గురించి ఈ సీజన్‌లో పాల్గొన్న నటి అదితి శర్మ మాట్లాడుతూ.. ఇదొక క్రేజీ ప్రయాణం. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఎక్స్‌పీరియన్స్ చేయగలం. నేను చాలా ఎంజాయ్ చేశాను. కొన్ని రోజులు సంతోషంగా, మరికొన్ని రోజులు కష్టంగా గడిచాయి. కానీ ఈ ప్రయాణంలో నా బలాలు, బలహీనతలు తెలుసుకున్నాను. నా గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను. కొన్ని షాక్‌లు తగిలినప్పుడైతే జీవితాన్ని ఆస్వాదించడం, ఒదిగి ఉండటం నేర్చుకున్నాను. ఈ ప్రపంచం అందమైనది. ఈ సృష్టిలో ఉన్న ప్రతీది నాకిప్పుడు అందంగానే కనిపిస్తోంది.
అవన్నీ నిజమైనవే
భారత్‌కు రాగానే అందరూ అడిగిన ప్రశ్న.. షోలో చూపించేవి నిజమైన స్టంట్సేనా? అని! అవును నిజమే.. ఎలక్ట్రిక్ షాక్‌లు, కీటకాలు, జంతువులు.. ఇలా ప్రతీది నిజమే.. ఓ స్టంట్‌లో అయితే కొన్ని తేళ్లు నా మెడను కుట్టేశాయి. దాన్నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అయితే ఇలాంటివేమైనా జరిగితే స్పాట్‌లో ట్రీట్‌మెంట్ చేస్తారు. అయినా ఆ నొప్పి భరించలేము' అని చెప్పుకొచ్చింది. కాగా అదితి.. ఖత్రాన్ కి ఖిలాడీ షో కోసం రొమేనియాలో దాదాపు 40 రోజుల పాటు ఉంది. ఈ మధ్యే ఇండియాకు వచ్చింది.
చదవండి: ఎన్టీఆర్‌కు ఒక సెకను చాలు.. అదే నాకైతే 10 రోజులు: జాన్వీ కపూర్
Comments
Please login to add a commentAdd a comment