Santanam
-
తెలుగు ప్రేక్షకులు రియల్ సినిమా లవర్స్
సంతానం, సురభి ప్రధాన తారాగణంగా ఎస్. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘డీడీ రిటర్న్స్’. ఈ చిత్రం ఈ ఏడాది జూలై 28న విడుదలై, తమిళంలో ఘన విజయం సాధించిందని చిత్ర యూనిట్ పేర్కొంది. నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు కలిసి ఈ చిత్రాన్ని ‘డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా’ పేరుతో తెలుగులో ఈ నెల 18న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో సంతానం మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకులు రియల్ సినిమా లవర్స్. ‘డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా’ ఓ రోలర్ కోస్టర్ ఫన్ రైడ్. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు. ‘‘రాజమౌళిగారి తమిళ వెర్షన్ ‘ఈగ’ సినిమాలో సంతానంగారు ఓ కీలక ΄ాత్ర చేశారు. ఆ సినిమాకు నేను డైలాగ్స్ రాశాను. దర్శకుడిగా ‘డీడీ రిటర్న్స్’ నా తొలి చిత్రం. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు ప్రేమ్ ఆనంద్. ‘‘మంచి కంటెంట్ ఉన్న డబ్బింగ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఈ కోవలోనే ఈ చిత్రాన్ని ఆదరించి, విజయవంతం చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు ఎన్వీ ప్రసాద్. -
నటుడు సంతానంకు ఊరట
సాక్షి, చెన్నై: కోలీవుడ్ హస్యనటుడు సంతానంకు చెన్నై హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. సంతానంకు, బిల్డింగ్ కాంట్రాక్టర్ షణ్ముగసుందరంనకు మధ్య ఆర్ధిక లావాదేవీల సమస్య కారణంగా గత సోమవారం వాగ్వాదం జరిగి అది కొట్టుకునే వరకూ దారి తీసింది. ఆ గొడవల్లో షణ్ముగంతో పాటు, అతని స్నేహితుడు, న్యాయవాది, బీజేపీ నాయకుడు ప్రేమానందన్ గాయాలపాలైన సంగతి విదితమే. దీంతో న్యాయవాది ప్రేమానందన్ స్థానిక వలసరవాక్కం పోలీస్‌స్టేషన్‌లో సంతానంపై హత్యా బెదిరింపుల కేసు నమోదు చేయడంతో అతను అజ్ఙాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. కాగా సంతానం ముందస్తు బెయిల్ కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ న్యాయమూర్తి ఆదిత్యన్ సమక్షంలో విచారణకు రాగా రెండు రోజులుగా వాయిదా వేస్తూ వచ్చారు. శుక్రవారం మరోసారి విచారణకు రాగా గాయాల పాలైన న్యాయవాది ప్రేమానందన్ ప్రభుత్వ ఆస్పత్తిలో చేరారా?లేదా? అన్న వివరాలను విచారించి కోర్టుకు అందించాల్సిందిగా వలసర వాక్కం పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ నటుడు సంతానంకు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అయితే సంతానం రెండు వారాల పాటు రోజూ వలసరవాక్కం పోలీస్‌స్టేషన్‌లో క్రమం తప్పకుండా సంతకం చేయాలని ఆదేశించారు. -
అజ్ఞాతంలో నటుడు సంతానం
తమిళసినిమా (చెన్నై): ప్రముఖ నటుడు సంతానంపై హత్యా బెదిరింపుల కేసు నమోదైంది. దీంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. తమిళ చిత్ర పరిశ్రమలో సంతానం హాస్యనటుడిగా ఎదిగి, అనంతరం కథానాయకుడిగా రాణిస్తున్నారు. ఈయన చెన్నై, వలసరవాక్కం, చౌదరినగరానికి చెందిన కాంట్రాక్టర్ షణ్ముగసుందరంతో కలసి కుండ్రత్తూర్ సమీపంలోని కోవూర్ ప్రాంతంలో కల్యాణ మండపాన్ని కట్టడానికి సన్నాహాలు చేశారు. అందుకు తన భాగంగా భారీ మొత్తాన్ని షణ్ముగసుందరానికి ఇచ్చారు. తరువాత కల్యాణ మండపం నిర్మాణాన్ని విరమించుకున్నారు. దీంతో తను చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వవలసిందిగా షణ్ముగసుందరంను సంతానం అడగ్గా కొంత డబ్బు మాత్రం ఇచ్చి మిగిలిన డబ్బును ఇవ్వకండా కాలం గడపడంతో సోమవారం సంతానం తన మేనేజర్ రమేష్‌తో కలసి వలసరవాకంలోని షణ్ముగసుందరం కార్యాలయానికి వెళ్లి డబ్బు తిరిగి ఇవ్వవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగి కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ఆ సమయంలో షణ్ముగసుందరంతో పాటు, ఆయన మిత్రుడు, స్థానిక బీజేపీ నాయకుడు, న్యాయవాది ప్రేమానంద్ ఉన్నారు. కొట్లాటలో ఈ ముగ్గురికీ దెబ్బలు తగిలాయి. నటుడు సంతానం వెంటనే స్థానిక వడపళనిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అదే ఆస్పత్రిలో షణ్ముగసుందరం చేరారు. కాగా, బీజేపీ నాయకుడు ప్రేమానంద్‌కు గాయాలయ్యాయన్న విషయం తెలిసిన పార్టీ కార్యకర్తలు ఆస్పత్రికి వచ్చి ఆందోళనకు దిగారు. అనంతరం సోమవారం రాత్రి వలసరవాక్కం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సంతానంపై కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు సంతానంపై మూడు సెక్షన్లలో కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను విచారించడానికి ప్రయత్నించగా సంతానం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. దీంతో సంతానంను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సంఘటన కోలీవుడ్‌లో కలకలానికి దారితీసింది. -
స్నేహం కోసం!
ఓ స్టార్ హీరో.. ఓ కామెడీ హీరో సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరించడం అంటే అది న్యూసే. ఇప్పుడు చెన్నై కోడంబాక్కమ్‌లో ఈ న్యూస్ జోరుగా ప్రచారంలో ఉంది. అవును మరి... హీరో శింబు... హీరోగా మారిన కమెడియన్ సంతానం సినిమాకి పాటలు స్వరపరచడం అంటే న్యూసే కదా. వాస్తవానికి శింబూలో మంచి సింగర్ ఉన్న విషయం తమిళ ప్రేక్షకులకు తెలుసు. ‘పోటుగాడు’లో పాడిన ‘బుజ్జి పిల్ల...’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు తన సింగింగ్ టాలెంట్‌ను వినిపించారు శింబు. ఇక, సంగీతదర్శకుడిగా చేస్తున్న తాజా చిత్రం ‘సక్కపోడు పోడు రాజా’ విషయానికి వస్తే.. సేతురామన్ దర్శకత్వంలో వీటీవీ గణేశ్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. సంతానంతో ఉన్న స్నేహం కారణంగానే శింబు ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ‘‘సంగీత దర్శకుడిగా నా కొత్త ప్రయాణం మొదలైంది. ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడానికి కారణం సంతానం. ఎప్పటిలాగే మీ ప్రేమ, ఆశీస్సులు నాకు ఉండాలి’’ అని శింబు పేర్కొన్నారు. -
సంగీత దర్శకుడిగా శింబు
సంచలన నటుడు శింబు మరో కొత్త అవతారం ఎత్తడానికి సిద్ధం అయ్యారు. కథానాయకుడిగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న శింబు కథకుడిగా, దర్శకుడిగా, గాయకుడిగానూ తన సత్తా చాటుకున్నారు. ఆ మధ్య బీప్ సాంగ్‌తో వివాదాలకు కారణమై, కేసులు, కోర్టుల వరకూ వెళ్లిన శింబు తాజాగా సంగీత దర్శకుడనే కొత్త హోదాకు రెడీ అయ్యారు. శింబు, సంతానం మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెర నటుడైన సంతానంను వెండి తెరకు పరిచయం చేసిన ఘనత శింబుదే. అదే విధంగా శింబు హీరోగా నటించిన విన్నైతాండి వరువాయా చిత్రంతో హస్యనటుడుగా ప్రాచుర్యం పొందిన వీటీవీ గణేశ్‌కు ఆయనంటే ప్రత్యేక అభిమానం. సంతానం కథానాయకుడిగా వీటీవీ.గణేశ్ నిర్మిస్తున్న చిత్రం చక్కపోడు పోడు రాజా చిత్రం ద్వారా శింబు సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సర్వర్ సుందరం చిత్రం ఫేమ్ వైభవి శాండిల్య నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి సేతురామన్ దర్శకుడు. తాను సంగీత దర్శకుడిగా అవతారమెత్తడం గురించి శింబు స్పందిస్తూ ఆ చిత్ర దర్శక, నిర్మాతలు సంగీతాన్ని అందించమని కోరారని, కథ విన్న తాను నచ్చడంతో సంగీతాన్ని అందించడానికి అంగీకరించానని తెలిపారు. తనకు సంగీతం అంటే ఆసక్తి అధికం అన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అందువల్ల సంగీత దర్శకుడిగా అవతారమెత్తినట్లు చెప్పారు. తాను మంచి సంగీతాన్ని అందించడానికి కృషి చేస్తానని, దాన్ని ఎలా ఆదరిస్తారన్నది ప్రేక్షకుల చేతిలో ఉంటుందని శింబు పేర్కొన్నారు. ఆయన ఇప్పుడు త్రిపాత్రాభినయం చేస్తున్న అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో నటిస్తున్నారు. -
సెల్వరాఘవన్, సంతానం చిత్రం ప్రారంభం
సంచలన దర్శకుడు సెల్వరాఘవన్, కామెడీ చిత్రాల కథానాయకుడు సంతానం కలరుుకలో చిత్రం ప్రారంభమైంది. వీరి కాంబినేషన్లో చిత్రం తెరకెక్కనుందన్న వార్త ప్రచారం అవగానే నిజంగా అది జరిగేనా? అన్న సందేహాలు పరిశ్రమ వర్గాల్లో చాలా మందికి కలిగారుు. కారణం లేకపోలేదు. సెంటిమెంట్‌తో కట్టిపడేసే చిత్రాల దర్శకుడుగా పేరొందిన సెల్వరాఘవన్ హాస్యచిత్రాల నటుడు సంతానం హీరోగా చిత్రం చేయగలరా? అన్నదే వారి సందేహాంగా భావించాలి. అరుుతే అలాంటి వారి సందేహాన్ని పటాపంచలు చేస్తూ ఈ సంచలన కాంబినేషన్లో చిత్రం ఆదివారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎస్జే.సూర్య హీరోగా నెంజం మరప్పదిలై చిత్రాన్ని పూర్తి చేసిన సెల్వరాఘవన్ సంతానం కోసమనే ఒక రొమాంటిక్ కామెడీ కథను తయారు చేశారట. ఫిలిం డిపార్ట్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో సంతానంకు జంటగా నటి అదితి నటిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని, లోక్‌నాథ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి బహుళ ప్రాచుర్యం పొందిన పాటలోని పల్లవి అని మన్నవన్ వందానడి పేరును నిర్ణరుుంచినట్లు సమాచారం. -
ఆ కామెడీ హీరో సంపాదన అంతా!
కోలీవుడ్ ప్రముఖ కమెడీయన్ సంతానం తన హస్యంతో సునామీ సృష్టిస్తున్నాడు. ప్రతి పాత్రను పండించే సత్తా ఉన్న నటుడు సంతానం. తన కామెడీతో తమిళ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. హీరోగా కూడా నటిస్తూ స్టార్ హీరోలకు ధీటుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ హాస్య నటుడు ఇటీవల తొమ్మిది మంది ముద్దుగుమ్మలతో రొమాన్స్ చెయ్యడానికి సిద్దపడ్డాడు. వడివేలుకు రాజకీయ గ్రహణం పట్టడంతో సంతానం దశతిరిగింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో సంతానం క్రేజ్ టాప్ రేంజ్లో ఉంది. అతను లేకుండా తమిళంలో ఏ స్టార్ హీరో కూడా సినిమాలు చేయడం లేదు. సంవత్సరంలో దాదాపు 15 సినిమాల్లో నటించే సంతానం సగటున ఏడాదికి 30 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. గత సంవత్సరం ఇతని ఇంటిపై ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడి కూడా చేశారు. అది వేరే విషయం. మొత్తానికి సంతానం సినిమాలతో ఊపిరిసలపనంత బిజీబిజీగా ఉన్నాడు. తెలుగులో ప్రముఖ హాస్యనటుడు సునీల్ హీరోగా రూపొందించిన 'మర్యాద రామన్న' సినిమాను తమిళంలో 'వల్లవునుక్కు పుల్లుం ఆయుధం' పేరుతో రీమేక్ చేశారు. ఆ చిత్రంతో సంతానం హీరోగా మారిపోయాడు. ఇప్పడు దర్శకుడు విజయ్ చందర్ 'కన్నిరాశి' టైటిల్‌తో తెరకెక్కబోతున్న మరో మూవీలో సంతానం తొమ్మిది మంది హీరోయిన్స్‌తో ఆడిపాడేందుకు రెఢీ అయ్యాడు. ఇప్పటికే ఆ చిత్ర దర్శకుడు ఆ తొమ్మిది మంది బ్యూటీస్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. అంతమంది అందాల భామలు ఎవరన్నదానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. శృతిహాసన్, నయనతార, తమన్నా, కాజల్, అంజలి, ఆండ్రియా...వంటి హీరోయిన్లతో దర్శకుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. - శిసూర్య