స్నేహం కోసం! | Simbu turns music director for Santhanam's Sakka Podu Podu Raja | Sakshi
Sakshi News home page

స్నేహం కోసం!

Published Fri, Dec 23 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

స్నేహం కోసం!

స్నేహం కోసం!

ఓ స్టార్‌ హీరో.. ఓ కామెడీ హీరో సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరించడం అంటే అది న్యూసే. ఇప్పుడు చెన్నై కోడంబాక్కమ్‌లో ఈ న్యూస్‌ జోరుగా ప్రచారంలో ఉంది. అవును మరి... హీరో శింబు... హీరోగా మారిన కమెడియన్‌ సంతానం సినిమాకి పాటలు స్వరపరచడం అంటే న్యూసే కదా. వాస్తవానికి శింబూలో మంచి సింగర్‌ ఉన్న విషయం తమిళ ప్రేక్షకులకు తెలుసు. ‘పోటుగాడు’లో పాడిన ‘బుజ్జి పిల్ల...’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు తన సింగింగ్‌ టాలెంట్‌ను వినిపించారు శింబు.

ఇక, సంగీతదర్శకుడిగా చేస్తున్న తాజా చిత్రం ‘సక్కపోడు పోడు రాజా’ విషయానికి వస్తే.. సేతురామన్‌ దర్శకత్వంలో వీటీవీ గణేశ్‌ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. సంతానంతో ఉన్న స్నేహం కారణంగానే శింబు ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ‘‘సంగీత దర్శకుడిగా నా కొత్త ప్రయాణం మొదలైంది. ఈ చిత్రానికి మ్యూజిక్‌ అందించడానికి కారణం సంతానం. ఎప్పటిలాగే మీ ప్రేమ, ఆశీస్సులు నాకు ఉండాలి’’ అని శింబు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement