తెలుగు ప్రేక్షకులు రియల్‌ సినిమా లవర్స్‌ | santhanam and surbhi DD Returns Press Meet | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రేక్షకులు రియల్‌ సినిమా లవర్స్‌

Published Sun, Aug 13 2023 6:20 AM | Last Updated on Sun, Aug 13 2023 6:20 AM

santhanam and surbhi DD Returns Press Meet - Sakshi

సంతానం, సురభి ప్రధాన తారాగణంగా ఎస్‌. ప్రేమ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘డీడీ రిటర్న్స్‌’. ఈ చిత్రం ఈ ఏడాది జూలై 28న విడుదలై, తమిళంలో ఘన విజయం సాధించిందని చిత్ర యూనిట్‌ పేర్కొంది. నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు కలిసి ఈ చిత్రాన్ని ‘డీడీ రిటర్న్స్‌ భూతాల బంగ్లా’ పేరుతో తెలుగులో ఈ నెల 18న విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో సంతానం మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకులు రియల్‌ సినిమా లవర్స్‌. ‘డీడీ రిటర్న్స్‌ భూతాల బంగ్లా’ ఓ రోలర్‌ కోస్టర్‌ ఫన్‌ రైడ్‌. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు. ‘‘రాజమౌళిగారి తమిళ వెర్షన్‌ ‘ఈగ’ సినిమాలో సంతానంగారు ఓ కీలక ΄ాత్ర చేశారు. ఆ సినిమాకు నేను డైలాగ్స్‌ రాశాను. దర్శకుడిగా ‘డీడీ రిటర్న్స్‌’ నా తొలి చిత్రం. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు ఈ సినిమాను బాగా ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు ప్రేమ్‌ ఆనంద్‌. ‘‘మంచి కంటెంట్‌ ఉన్న డబ్బింగ్‌ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఈ కోవలోనే ఈ చిత్రాన్ని ఆదరించి, విజయవంతం చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు ఎన్వీ ప్రసాద్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement