ఆ కామెడీ హీరో సంపాదన అంతా! | Comedian Santanam as Hero | Sakshi
Sakshi News home page

ఆ కామెడీ హీరో సంపాదన అంతా!

Published Sat, Jul 5 2014 4:00 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

సంతానం - Sakshi

సంతానం

కోలీవుడ్ ప్రముఖ కమెడీయన్  సంతానం తన హస్యంతో సునామీ సృష్టిస్తున్నాడు. ప్రతి పాత్రను పండించే సత్తా ఉన్న నటుడు సంతానం. తన కామెడీతో తమిళ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. హీరోగా కూడా నటిస్తూ స్టార్ హీరోలకు ధీటుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ హాస్య నటుడు ఇటీవల తొమ్మిది మంది ముద్దుగుమ్మలతో రొమాన్స్‌ చెయ్యడానికి సిద్దపడ్డాడు. వడివేలుకు రాజకీయ గ్రహణం పట్టడంతో సంతానం దశతిరిగింది.

 ప్రస్తుతం కోలీవుడ్లో  సంతానం క్రేజ్  టాప్ రేంజ్లో ఉంది. అతను లేకుండా తమిళంలో ఏ స్టార్ హీరో కూడా సినిమాలు చేయడం లేదు. సంవత్సరంలో దాదాపు 15 సినిమాల్లో నటించే సంతానం సగటున ఏడాదికి 30 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం.  గత సంవత్సరం ఇతని ఇంటిపై ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడి కూడా చేశారు. అది వేరే విషయం. మొత్తానికి సంతానం సినిమాలతో ఊపిరిసలపనంత బిజీబిజీగా ఉన్నాడు.

తెలుగులో ప్రముఖ హాస్యనటుడు సునీల్ హీరోగా రూపొందించిన 'మర్యాద రామన్న' సినిమాను తమిళంలో 'వల్లవునుక్కు పుల్లుం ఆయుధం' పేరుతో రీమేక్ చేశారు. ఆ చిత్రంతో  సంతానం హీరోగా మారిపోయాడు. ఇప్పడు దర్శకుడు విజయ్‌ చందర్‌  'కన్నిరాశి' టైటిల్‌తో తెరకెక్కబోతున్న మరో మూవీలో సంతానం తొమ్మిది మంది హీరోయిన్స్‌తో ఆడిపాడేందుకు రెఢీ అయ్యాడు. ఇప్పటికే ఆ చిత్ర దర్శకుడు ఆ తొమ్మిది మంది బ్యూటీస్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నాడని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. అంతమంది అందాల భామలు ఎవరన్నదానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. శృతిహాసన్, నయనతార, తమన్నా, కాజల్, అంజలి, ఆండ్రియా...వంటి హీరోయిన్లతో దర్శకుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

 - శిసూర్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement