‘‘కెమెరా ముందుకెళ్లిపోయిన తర్వాత నన్ను నేను మర్చిపోతా. ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలోకి ఒదిగిపోతా. కెమెరా ముందు ఉన్నది తాప్సీ అని చూసేవాళ్లనుకుంటారు. కానీ అక్కడున్నది నేను కాదు నకిలీ అనే విషయం నాకు మాత్రమే తెలుసు’’ అంటున్నారు తాప్సీ. దీన్ని బట్టి ఈ ఢిల్లీ బ్యూటీ పాత్రలో ఎంతగా ఒదిగిపోతారో అర్థం చేసుకోవచ్చు. తన కెరీర్ గురించి చెబుతూ -‘‘నేను శిక్షణ పొందిన ఆర్టిస్ట్‌ని కాదు. ఫిల్మీ బ్యాగ్రౌండ్ కూడా లేదు
‘‘కెమెరా ముందుకెళ్లిపోయిన తర్వాత నన్ను నేను మర్చిపోతా. ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలోకి ఒదిగిపోతా. కెమెరా ముందు ఉన్నది తాప్సీ అని చూసేవాళ్లనుకుంటారు. కానీ అక్కడున్నది నేను కాదు నకిలీ అనే విషయం నాకు మాత్రమే తెలుసు’’ అంటున్నారు తాప్సీ. దీన్ని బట్టి ఈ ఢిల్లీ బ్యూటీ పాత్రలో ఎంతగా ఒదిగిపోతారో అర్థం చేసుకోవచ్చు. తన కెరీర్ గురించి చెబుతూ -‘‘నేను శిక్షణ పొందిన ఆర్టిస్ట్‌ని కాదు. ఫిల్మీ బ్యాగ్రౌండ్ కూడా లేదు. అందుకని ‘మనం కరెక్ట్‌గానే యాక్ట్ చేస్తున్నామా’ అని నాకు నేను టెస్ట్ పెట్టుకుంటా. అప్పుడు నా తప్పులు నాకు తెలిసిపోతాయి.
ఆ తప్పులు తర్వాతి సినిమాలో చేయకుండా జాగ్రత్త పడతా’’ అన్నారు తాప్సీ. అంతా బాగానే ఉంది కానీ.. ఇటీవల ఈ బ్యూటీ ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ హాట్ టాపిక్ అయ్యింది. అదేంటంటే.. మీకెవరితో డేటింగ్ చేయాలని ఉందని ఎవరో తాప్సీని అడిగితే... తమిళ హీరో ‘అజిత్’ పేరు చెప్పారట. ఒకవేళ అవకాశం వస్తే.. ఈ హీరోగారితో ఓ అందమైన లొకేషన్‌లో మనోభావాలు పంచుకుంటూ, నచ్చిన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయాలని పేర్కొన్నారట తాప్సీ. వేరే ఏదేదో చెబితే.. అజిత్ భార్య షాలిని కంగారుపడేవారేమో. తాప్సీ చెప్పినవి సాదాసీదా ఇష్టాలే కాబట్టి.. లైట్ తీసుకుంటారని ఊహించవచ్చు. ఇక, తాప్సీకి అజిత్ ఎప్పుడు డేట్ ఇస్తారో మరి!