మిస్‌ లాయర్‌ | Taapsee will be acting as a lawyer in Pink movie. | Sakshi
Sakshi News home page

మిస్‌ లాయర్‌

Published Tue, Jun 27 2017 11:40 PM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

మిస్‌ లాయర్‌

మిస్‌ లాయర్‌

తాప్సీ కూల్‌ గాళ్‌. ఎంత పెద్ద విషయాన్నైనా కూల్‌గా డీల్‌ చేస్తారు. వాదించడం ఇష్టం ఉండదు. నిజజీవితంలో తాప్సీ స్వభావం ఇలానే ఉంటుంది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే రియల్‌ లైఫ్‌లో కాదు. ఓ సినిమా కోసం తాప్సీ తన మనస్తత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించనున్నారు. అది హిందీ సినిమా.అభినయ్‌ డియో డైరెక్షన్‌లో రూపొందనున్న చిత్రంలో ఆమె లాయర్‌గా నటించనున్నారు. కోర్టులో ఎలా వాదిస్తారో తాప్సీకి తెలుసు.

‘పింక్‌’లో బోలెడన్ని కోర్టు సీన్లు ఉన్నాయనే విషయం గుర్తుండే ఉంటుంది. అయితే అందులో బాధితురాలిగా కోర్టు బోనులో నిలబడ్డారు. తాజా చిత్రంలో బాధితుల పక్షాన వాదించనున్నారు. లాయర్లు ఎలా వాదిస్తారో చూసినప్పటికీ, స్వయంగా ఆ పని చేయాలంటే కొంత అనుభవం కావాలి కదా. అందుకే ఈ సినిమా స్టార్ట్‌ కాబోయే నెల రోజుల ముందే ట్రైనింగ్‌ తీసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం తాప్సీ నార్వేలో హాలీడేస్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. వచ్చే నెలలో పోర్చుగల్‌లో జరుగునున్న ‘జుడ్వా’ మూవీ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. మరోవైపు లాయర్‌గా శిక్షణ తీసుకుంటారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement