చెంప చెళ్లుమనేదే! కానీ... | Tapsee Nam Shabana release on 31st | Sakshi
Sakshi News home page

చెంప చెళ్లుమనేదే! కానీ...

Published Tue, Mar 21 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

చెంప చెళ్లుమనేదే! కానీ...

చెంప చెళ్లుమనేదే! కానీ...

హిందీలో ‘బేబీ’, ‘పింక్‌’, ‘నామ్‌ షబానా’ సినిమాలు తాప్సీకి యాక్షన్‌ గాళ్‌ ఇమేజ్‌ తీసుకొచ్చాయి. ఈ నెల 31న విడుదల కానున్న ‘నామ్‌ షబానా’ ట్రైలర్‌లో అయితే పవర్‌ ప్యాక్డ్‌ పంచ్‌లతో చెలరేగారు. రియల్‌ లైఫ్‌లోనూ తాప్సీ తీరు పరిశీలిస్తే... ఫైర్‌ బ్రాండ్‌ను తలపిస్తుందనే చెప్పాలి.

కానీ, ‘నేనంత ఫైర్‌బ్రాండ్‌ను కాదండీ బాబు’ అంటున్నారు తాప్సీ. కనీసం ఓ మనిషిని చెంపదెబ్బ కూడా కొట్టలేనన్నారు. ఆమె కాలేజీ రోజుల్లో జరిగిన ఓ ఘటన గురించి తాప్సీ మాట్లాడుతూ.. ‘‘కాలేజీలో ఈవ్‌ టీజింగ్‌ చేసేవారు. కొన్నిసార్లు ఎక్కడెక్కడో చేతులు వేసేవారు. అసభ్యంగా ప్రవర్తించేవారు. ఓసారి విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడు ఓ అబ్బాయి చెంప గట్టిగా చెళ్లుమనేది. కానీ, నేను అంత సాహసం చేయలేకపోయా. బహుశా... భయపడి ఉంటాను’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement