పరుగు పందెంలో ఆఖరి రౌండ్‌కి వచ్చేశారు రష్మి.. ఫలితం ఏమైందన్నది మాత్రం సినిమా చూస్తేనే తెలుస్తుంది. తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘రష్మి రాకెట్’. ఇందులో రష్మి అనే రన్నర్ పాత్రలో తాప్సీ కనిపిస్తారు. ఆఖర్ష్ ఖురానా దర్శకుడు. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ గుజరాత్‌లో ప్రారంభం అయింది. ఫిబ్రవరి వరకూ సాగే ఈ షెడ్యూల్‌తో ‘రష్మి రాకెట్’ చిత్రీకరణ పూర్తవుతుంది. ఇందులో అథ్లెట్‌గా కనిపించడం కోసం శరీరాకృతిని మొత్తం మార్చుకున్నారు తాప్సీ. కఠినమైన వ్యాయామాలు చేశారు. స్ట్రిక్ట్ డైట్ పాటించారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment