
వాయిదాల మీద వాయిదాలు. హీరోలు మారారు. డైరెక్టర్స్ కుదర్లేదు. ఫైనల్లీ ‘మన్‌మర్జియా’ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, తాప్సీ, విక్కీ కుషాల్ ముఖ్య తారలుగా నటించనున్నారు. ఈ సినిమాను దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించనున్నారు. తొలుత మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తాడన్న వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్లేస్‌లోకి అభిషేక్ బచ్చన్ వచ్చారు.
రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో స్టార్ట్ కానుంది. ఫస్ట్ షెడ్యూల్ జమ్మూలో, ఆ తర్వాత ఢిల్లీలో షూట్ చేయనున్నారట. ఈ సినిమాలో తాప్సీది మంచి పాత్ర అని సమాచారం. వరుస బాలీవుడ్ ఆఫర్స్‌తో జెట్ స్పీడ్‌తో దూసుకెళుతున్నారు తాప్సీ. స్పోర్ట్స్ డ్రామా ‘సూర్మ’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి, ‘దిల్ జంగిల్’ సినిమాతో బిజీగా ఉన్నారామె. వచ్చే నెల నుంచి ‘మన్‌మర్జియా’తో ఇంకా బిజీ అవుతారు. తెలుగులోనూ తాప్సీ ఓ సినిమా చేస్తున్నారు.
అనురాగ్ కశ్యప్, ఆనంద్ ఎల్. రాయ్, విక్కీ కుషాల్, తాప్సీ, అభిషేక్
Comments
Please login to add a commentAdd a comment