
ఒక్క అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించడం చాలా సినిమాల్లో చూశాం. ఆ ఇద్దరిలో ఒక యువకుడి ప్రేమ మాత్రమే గెలుస్తుంది. ఇలా ముక్కోణపు ప్రేమకథలు ఎన్ని వచ్చినా.. ఏదో ఒక్క కొత్త ట్విస్ట్ పెట్టి, కొత్త కథలా చూపిస్తుంటారు దర్శకులు. ఇప్పుడు దర్శకుడు అనురాగ్ కశ్యప్ అలాంటి లవ్‌స్టోరీ చూపించే పని మీదే ఉన్నారు. యాక్చువల్‌గా అనురాగ్ అంటే గుర్తొచ్చేది గన్స్. ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’, ‘బాంబే వెల్వట్’ వంటి యాక్షన్ మూవీస్ అందుకు నిదర్శనం. కానీ, ఈసారి ఆయన గులాబీలు వైపు మొగ్గు చూపారు.
మరి.. ప్రేమకథ అంటే గులాబీలు ఉంటాయి కదా! ఇందులో తాప్సీ, విక్కీ కుశాల్, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్‌కి ఇది రెండో హిందీ సినిమా. దుల్కర్ తొలి హిందీ చిత్రం ‘కర్వాణ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. మలయాళ చిత్రం ‘కమ్మాటిపాడం’లో దుల్కర్ నటన చూసి అనురాగ్ క్లీన్ బౌల్డ్ అయ్యారట. అందుకే తన తాజా లవ్‌స్టోరీకి ఆయన్ను తీసుకోవాలనుకున్నారట. ఆనంద్.ఎల్.రాయ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మన్‌మర్జియా’ అనే టైటిల్ ఖరారు చేశారు.