
తాప్సీ, అభిషేక్ బచ్చన్
మనసు ఏం కోరుకుంటే అది జరగాలనుకుంటాం. ప్రస్తుతం తాప్సీ ఒక్క కోరిక కోరుకున్నారు. అది పెళ్లి గురించి కాదు. సినిమా హిట్టవ్వాలని మనసులో అనుకున్నారు. ఆ కోరిక నెరవేర్చమని దేవుణ్ణి కోరారు. ఈ ఢిల్లీ బ్యూటీ ప్రస్తుతం ‘మన్‌మర్జియా’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. అంటే.. మనసుకి ఇష్టమైనది అని అర్థం. ఈ సినిమా కోసమే తాప్సీ అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కి వెళ్లారు. సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు గుడి గంట మోగించి, మంచి జరగాలని కోరుకున్నారు.
అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్, తాప్సీ, విక్కీ కుశాల్ ముఖ్య తారలుగా నటిస్తున్న సినిమా ‘మన్‌మర్జియా’. ఈ సినిమా షూటింగ్‌ను ప్రేమికుల రోజున అమృత్‌సర్‌లో స్టార్ట్ చేశారు. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను ఆల్మోస్ట్ టు మంత్స్ అమృత్‌సర్‌లో షూట్ చేయడానికి ప్లాన్ చేశారు. స్వామికార్యం స్వకార్యం అన్నట్లు.. అక్కడి గుడి సందర్శించి, తొలి సీన్‌కి క్లాప్ కొట్టడానికి ముందే గుడి గంట మోగించారు తాప్సీ.
Comments
Please login to add a commentAdd a comment