తాప్సీ
నా కెరీర్‌లోనే మోస్ట్ చాలెంజింగ్ రోల్ చేస్తున్నానని అంటున్నారు కథానాయిక తాప్సీ. తుషార్ హీరానందన్ దర్శకత్వంలో తాప్సీ, భూమి ఫడ్నేకర్ ప్రధాన పాత్రలుగా హిందీలో రూపొందుతున్న చిత్రం ‘శాండ్ కీ ఆంఖ్’. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓల్డెస్ట్ షార్ప్ షూటర్స్ చంద్రోస్, ప్రకాషి తోమర్ జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మిస్తున్నారు. ‘‘ప్రతిరోజూ ఉదయాన్నే గన్ షూట్ సాధన మొదలుపెడతాం. రోజూ నాలుగు గంటలు శిక్షణ తీసుకుంటున్నాను.
నా కోచ్ విశ్వజిత్ షిండే మంచి శిక్షణ ఇస్తున్నారు. గన్ ఎలా పట్టుకోవాలి? గన్ పేల్చుతున్నప్పుడు ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉండాలనే అంశాలపై మరింత పట్టు సాధిస్తున్నాను. సరైన సాధనతో ఇప్పుడు షూటింగ్ బాగానే చేస్తున్నాను. కానీ గన్ షూటింగ్ అంత సులభంగా రాలేదు. మొదట్లో ప్రయత్నించడానికే భయం వేసింది. దాంతో మోస్ట్ చాలెంజింగ్ రోల్ అనిపించింది’’ అని పేర్కొన్నారు తాప్సీ. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చి ‘బద్లా’ సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటున్నారామె. అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్యతారలుగా సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment