రానాపై జోకులేసిన హీరోయిన్ | 'Air India booked 2 people on the same seat' tweets Rana | Sakshi
Sakshi News home page

రానాపై జోకులేసిన హీరోయిన్

Published Thu, Oct 29 2015 3:43 PM | Last Updated on Sun, Sep 3 2017 11:41 AM

రానాపై జోకులేసిన హీరోయిన్

రానాపై జోకులేసిన హీరోయిన్

టాలీవుడ్ కండల వీరుడు రానా దగ్గుపాటి రీసెంట్గా ఎయిర్ ఇండియా విమానంలో చెన్నై నుంచి గోవా వెళ్తున్నారు. అయితే ఈ ప్రయాణంలో ఆయనకు ఓ డిఫరెంట్ అనుభవం ఎదురైంది.  ఫ్లైట్లో ఒకటే సీటును ఎయిర్ ఇండియా పొరపాటున ఇద్దరు ప్రయాణికులకు కేటాయించింది. దాంతో రానాతో పాటు మరో ప్రయాణికుడికి కూడా ఒకే నెంబర్ సీట్ వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే రానా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఆ ట్వీట్ చూసిన తాప్సీ పన్ను 'వావ్.. ఫైనల్లీ ఒకరి ఒళ్లో కూర్చునే అవకాశం వచ్చిందన్నమాట, ఎవరైనా ఇది ఊహించి ఉంటారా' అంటూ రానాను ఆట పట్టిస్తూ ట్వీట్ చేసింది. 'హహ్హహ్హ తాప్సీ..' అంటూ హాయిగా నవ్వుతూ రానా కూడా తాప్సీ ట్వీట్కి రెస్పాన్స్ ఇచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement