పై ఫొటోలో ఉన్న ఇద్దరు ముద్దుగుమ్మల మధ్యలో నక్కిన హీరో ఎవరో గుర్తుపట్టారా. చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్ డైనింగ్ టేబుల్ గతవారం విభిన్న కార్యక్రమానికి వేదికైంది. నవాబుల కాలం నుంచి పసందైన విందుకు వేదికైన ఆ టేబుల్ చుట్టూ ప్రముఖ మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. సుస్మితాసేన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ షోలో పలువురు టాలీవుడ్ నటులు మెరిశారు. ఆ సందర్భంగా తీసుకున్న సెల్ఫీలను ఎవరికి వాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ ఆనందం వ్యక్తం చేశారు.
కాగా ప్రగ్యా జైస్వాల్, సోనాల్ చౌహాన్లు కలిసి దిగిన ఓ సెల్ఫీ.. ఫొటోబాంబ్ (అనుకోకుండా ఒక ఫొటోలో వేరేవాళ్లు రావడం) అయ్యింది. ఫొటోబాంబ్ క్లాసిక్ అంటూ క్యాప్షన్ కూడా జోడించి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు ఆ హీరో. ఇంతకీ అతగాడిని గుర్తుపట్టినట్టేనా.. అతడే.. మన టాలీవుడ్ కండలవీరుడు రానా! ఈ ఫొటోకి అభిమానుల నుంచి భలే భలే కామెంట్లు వస్తున్నాయి. కాగా సామాజిక సంస్థ 'టీచ్ ఫర్ చేంజ్' వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫండ్ రైజింగ్ ఈవెంట్లో రానా కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.
ఈ ఫొటోలోని హీరోని గుర్తుపట్టండి..
Published Mon, Mar 14 2016 6:25 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM
Advertisement
Advertisement