రానా భుజాల మీద బన్నీ.. | 'Bunny and I in the madness' tweets Rana | Sakshi
Sakshi News home page

రానా భుజాల మీద బన్నీ..

Published Sun, Mar 6 2016 2:29 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

'Bunny and I in the madness' tweets Rana

టాలీవుడ్ కండలవీరుడు రానా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్లు ఓ ఈవెంట్లో ఎంజాయ్ చేస్తున్న సూపర్ ఫొటోను రానా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. బన్నీ రానా భుజాల మీద ఎక్కి ఉన్న ఆ ఫొటో ఫ్యాన్స్కి భలే నచ్చేసింది. రెండు కళ్లూ చాలట్లేదూ.. దిష్టి తగులుతుందేమో..సూపర్.. బంపర్.. అంటూ ట్వీట్ల వర్షం కురిపించారు.   

గచ్చిబౌలి స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన 'సెన్సేషన్' సంగీత ఝరిలో ఓలలాడారు సదరు స్టార్లు. ఈవెంట్ థీమ్ 'వైట్ అండ్ వైట్' కావడంతో  హాజరైనవారంతా శ్వేత వర్ణంలో వెలిగిపోయారు. 'వాట్ ఎ షో గయ్స్.. ' అంటూ రానా ఆ షోని ఎంత ఆస్వాదించారో చెప్పకనే చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement