రానా.. ప్రభాస్‌ను ట్విట్టర్‌లోకి తీసుకురా: కేటీఆర్‌ | KTR congratulates Bahubali team on twitter | Sakshi
Sakshi News home page

రానా.. ప్రభాస్‌ను ట్విట్టర్‌లోకి తీసుకురా: కేటీఆర్‌

Published Tue, Mar 29 2016 7:50 PM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

KTR congratulates Bahubali  team on twitter

హైదరాబాద్‌: దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా నిలువడంతో సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కే తారకరామారావు కూడా 'బాహుబలి' బృందాన్ని ట్విట్టర్‌లో అభినందించారు. ఎస్ఎస్ రాజమౌళి, రానా దగ్గుబాటి, శోభూ, తమన్నా తదితరులను ట్యాగ్ చేసి.. జాతీయ అవార్డు గెలిచిన సందర్భంగా ప్రశంసించారు.

అదే సమయంలో కేటీఆర్ ప్రభాస్‌ను కూడా ట్యాగ్ చేసేందుకు ప్రయత్నించి ఉంటారు. కానీ ప్రభాస్ ఇంకా ట్విట్టర్‌లో అడుగుపెట్టలేదు. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ రాణా.. నువ్వైనా ప్రభాస్‌ ను ట్విట్టర్‌లోకి తీసుకురావొచ్చు కదా అంటూ సరదాగా కామెంట్ చేశారు కేటీఆర్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement