రానా.. ప్రభాస్‌ను ట్విట్టర్లోకి తీసుకురా: కేటీఆర్
హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా నిలువడంతో సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు కూడా 'బాహుబలి' బృందాన్ని ట్విట్టర్లో అభినందించారు. ఎస్ఎస్ రాజమౌళి, రానా దగ్గుబాటి, శోభూ, తమన్నా తదితరులను ట్యాగ్ చేసి.. జాతీయ అవార్డు గెలిచిన సందర్భంగా ప్రశంసించారు.
అదే సమయంలో కేటీఆర్ ప్రభాస్‌ను కూడా ట్యాగ్ చేసేందుకు ప్రయత్నించి ఉంటారు. కానీ ప్రభాస్ ఇంకా ట్విట్టర్లో అడుగుపెట్టలేదు. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ రాణా.. నువ్వైనా ప్రభాస్ ను ట్విట్టర్లోకి తీసుకురావొచ్చు కదా అంటూ సరదాగా కామెంట్ చేశారు కేటీఆర్.
Kudos to Team Bahubali on winning the national award @ssrajamouli @RanaDaggubati @Shobu_ @tamannaahspeaks
P.s:Rana, Get Prabhas on Twitter
— KTR (@KTRTRS) 29 March 2016
కేటీఆర్ ట్వీట్‌పై 'బాహుబలి' నిర్మాత శోభూ యార్లగడ్డ స్పందిస్తూ 'ప్రభాస్‌ను ట్విట్టర్లోకి తెచ్చేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాం. అతనికి మీ ట్వీట్ కూడా చూపాం' అని తెలిపాడు. ఇక ప్రభాస్ అభిమానులు మంత్రి కేటీఆర్ సరదా వ్యాఖ్యలను స్వాగతించారు. ట్విట్టర్ లోకి ప్రభాస్ రావాల్సిందేనంటూ వరుసపెట్టి ట్వీట్ చేస్తున్నారు.