అసలు విందు బాహుబలి–2లోనే! | full biriyani in bahubali2 | Sakshi
Sakshi News home page

అసలు విందు బాహుబలి–2లోనే!

Published Wed, Mar 8 2017 11:12 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

అసలు విందు బాహుబలి–2లోనే! - Sakshi

అసలు విందు బాహుబలి–2లోనే!

హోటల్‌కు వెళ్లినప్పుడు బిర్యానీ తినేముందు వెయిటర్‌ కొన్ని స్టార్టర్స్‌ లను తీసుకొస్తాడు. నిజానికి అవి అంత గొప్ప రుచిగా ఏం ఉండవు. కానీ.. తినడానికి మనల్ని సిద్ధం చేస్తాయి. అసలైన భోజనం మాత్రం బిర్యానీ ముందుకొచ్చినప్పుడే.ఇప్పుడిదంతా ఎందుకనుకుంటున్నారా... అయితే రాజమౌళి చెబుతున్న మాటలు వినాల్సిందే.

తెలుగు చిత్రపరిశ్రమలో బాహుబలి చిత్రం ఓ ట్రెండ్‌ సెట్టర్‌. ఇంటిపక్కన ఉండే బామ్మ నుంచి ఇంగ్లండ్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌ వరకు ఆ సినిమా చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఎంత గొప్పగా ఉందో.. అంటూ దర్శకుడు రాజమౌళిని ఆకాశానికెత్తేశారు. అయితే త్వరలోనే బాహుబలి–2 విడుదల కాబోతోంది. ఇప్పటికే దీనిపై అంచనాలు ఎంతగానో పెరిగిపోయాయి. దీంతో ఆ సినిమా ఎలా ఉండబోతోంది? ప్రత్యేకతలేమున్నాయి? అనే ఆసక్తి  అభిమానుల్లోనే కాదు.. సినీ విశ్లేషకుల్లో కూడా ఓ రేంజ్‌లో ఉంది. దీనిపై ప్రముఖ సినీ విమర్శకురాలు ఒకరు రాజమౌళిని అడగ్గా.. రాజమౌళి ఇలా హోటల్‌ గురించి చెప్పుకొచ్చాడు. బాహుబలి–1 కేవలం స్టార్టప్‌లాంటిదేనని, అసలు విందు మొత్తం బాహుబలి–2లోనే ఉంటుందని చెబుతూ అంచనాలు మరింతగా పెంచేశాడు. 
 
మొదట పాత్రల పరిచయమే..అంత గొప్పగా ఉందని అందరూ మెచ్చుకుంటున్న మొదటి భాగంలో తాము కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేశామని, అసలు కథలోకి ఇంకా వెళ్లలేదని చెప్పాడు.  రెండో భాగంలోనే ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రుచులనూ వడ్డించామన్నారు. ‘నిజానికి ఈ సినిమా కోసం ఐదేళ్లుగా కష్టపడుతూనే ఉన్నాం. మా శక్తియుక్తులన్నింటినీ ఈ సినిమా మీదే పెట్టాం. ఈ ఐదేళ్లూ ఎంతో ఎంజాయ్‌ చేశాం. ఇప్పుడు ఇక సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టిపెట్టామ’న్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement