మా ఇంటికి ఎవరొచ్చారో తెలుసా?: రానా | 'This is who I met' tweets Rana | Sakshi
Sakshi News home page

మా ఇంటికి ఎవరొచ్చారో తెలుసా?: రానా

Published Mon, Mar 7 2016 4:05 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

మా ఇంటికి ఎవరొచ్చారో తెలుసా?: రానా - Sakshi

మా ఇంటికి ఎవరొచ్చారో తెలుసా?: రానా

టాలీవుడ్ కండల వీరుడు రానా ఇంటికి ఓ ఆదివారం అనుకోని అతిథి విచ్చేసింది. రావడంతోనే అందరినీ కంగారు పెట్టేసింది. ఫొటోలకు పోజిచ్చి ఆ అతిథి మెల్లగా జారుకోవడంతో అంతా చల్లగా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ భల్లాలదేవ ఇంటిల్లిపాదినీ కంగారుపెట్టిన ఆ అతిథి ఎవరనుకుంటున్నారు.. ఓ పాము. నిన్న మధ్యాహ్నం మా ఇంట్లో నేనెవరిని కలిశానో చూడండి అంటూ తమ ఇంట్లో చొరబడ్డ పాము ఫొటోను రానా సోమవారం ట్వీట్ చేశారు.

కాగా రానా నటిస్తున్న తదుపరి చిత్రం 'ఘాజీ' షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అండర్‌ వాటర్‌లో జరిగే వార్‌ ఎపిసోడ్‌ని చిత్రీకరించినట్లు సమాచారం. రెండవ షెడ్యూల్ మరో వారంలోనే మొదలు కానుంది. చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తీస్తున్న విషయం తెలిసిందే.

 

 One Sunday afternoon in my house!! This is who I met!! https://t.co/aUZqzlail7

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement