
పాము కల్లోకొస్తే గజగజ వణికిపోతాం. కళ్లెదురుగా కనిపిస్తే బిగుసుకుపోతాం. ‘పపపపపపపపప.. పాము...’ అంటూ పరుగులు తీస్తాం. అలాంటి సరీసృపాలను మనం అనేకం చూశాం. కానీ ఇక్కడ మీకు చెప్పబోయే పాము కొంచెం ప్రత్యేకమైనది. దీని రంగు కూడా కాస్తా ఆ భిన్నంగానే ఉంది. ఇప్పటి వరకు నీలి(బ్లూ) రంగు పాములను చూసిన వారు తక్కువే.. వాటిని లెక్కపెడితే వేళ్లల్లో కూడా ఉండకపోవచ్చు. లేత నీలి రంగులో ఉండే ఈ పాము పేరు బ్లూ పిట్ వైర్. దీనిని ‘లైఫ్ ఆన్ ఎర్త్’ అనే అకౌంట్ నుంచి ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోను చూస్తుంటే ఓ తోటలో చెట్టుకున్న గులాబీ పువ్వును వాటేసుకొని చక్కగా అతుక్కుపోయినట్లు కనిపిస్తోంది. (ఆమె నోటిలో నుంచి 4 అడుగుల పాము..)
ప్రస్తుతం ఈ పాముకు చెందిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఏకంగా రెండు మిలియన్ల వ్యూవ్స్ సంపాదించింది. ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ పాముపై నెటిజన్లు మనసు పారేసుకుంటున్నారు. చూడటానికి ఎంతో ముద్దుగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది పైకి కనిపించే అంతా సాఫ్ట్ కాదట ఈ పాము. ఇది అత్యంత విషపూరితమైనది. అంతే కాక ప్రాణాంతకమైన ఈ పాము కరిస్తే తీవ్రమైన నొప్పి, రక్తస్రావం అవుతుంది. మాస్కో జంతు ప్రదర్శకుల ప్రకారం.. పిట్ వైపర్ జాతీ పాములు సాధారణంగా తెలుపు, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇలా నీలం రంగులో ఉండటం అరుదు. ఇవి ఇండోనేషియా, తూర్పు తైమూర్లలో కనిపించే విషపూరిత పిట్ వైపర్ ఉప జాతులు. (13 అడుగుల మొసలిని కామ్‌గా తొలగించాడు)
The incredibly beautiful Blue Pit Viper pic.twitter.com/zBSIs0cs2t
— Life on Earth (@planetpng) September 17, 2020