
సోషల్‌మీడియాలో రోజులో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నేచర్ ఈజ్ మెటల్ అనే సంస్థ తన ట్విటర్‌లో షేర్ చేసిన వీడియో ఒకటి నెటిజన్లను విపరీతంగా ఆకర్షిసుంది. అదేంటంటే.. వీడియోలో ఒక ఎలుకను చూడగానే అచ్చం పాములా కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఎలుక అచ్చం పాములాగే వంపులు తిరుగుతూ పరుగులు పెట్టడంతో అసలు ఇది ఎలుకా..లేక పామా అన్న సందిగ్ధంలో పడిపోయారు. ఇది కచ్చితంగా వింత జీవే అయ్యుంటుదని కూడా చాలామంది కామెంట్లు పెట్టారు.
అయితే వీరి కామెంట్లు చూసిన నేచర్ మైండ్ అసలు విషయం వెల్లడించింది. పరిగెడుతున్న ఎలుక తోకకు ఒక ప్లాస్టిక్ తాడులాంటిది అతుక్కుపోవడంతో అది పరిగెడుతున్న కొద్ది ఆ తాడు కూడా దాని వెనకే వెళ్లడంతో అచ్చం పాములా కనిపించిందంటూ తెలిపారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న నెటిజన్లు తమ అంచనా తప్పిందంటూ సరదాగా నవ్వుకున్నారు. దాదాపు 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోనూ 10 లక్షల మందికి పైగా చూశారు. ఇంకెందుకు ఆలస్యం! వెంటనే మీరు కూడా వీడియో చూసి నవ్వుకోండి.
Rats pretending to be a snake to avoid predators pic.twitter.com/PVwOpkeVXv
— Nature is Metal (@NaturelsMetal) February 21, 2020