మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత సోషల్ మీడియాలో పాపులర్. ఆమెకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. జంతుప్రేమికురాలైన అమృత పాము, ఒకరకం బల్లితో దిగిన ఫొటోలు ట్విట్టర్‌లో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలకు...
‘అత్యంత ప్రమాదకరమైన, విషతుల్యమైన జంతువు మనిషి మాత్రమే’ అనే కాప్షన్ ఇచ్చింది అమృత.
‘ఫోటోల కంటే మీ కాప్షన్ అద్భుతంగా ఉంది’ ‘సాటిజీవుల పట్ల మనకు ఉండాల్సిన ప్రేమను అందంగా అద్దం పట్టిన ఫొటోలు ఇవి’... అంటూ నెటిజనులు స్పందించారు. తన ట్విట్టర్ ప్రొఫైల్ బయోలో బ్యాంకర్, ప్లేబ్యాక్ సింగర్, సోషల్ వర్కర్ అని రాసుకుంది అమృత.
Comments
Please login to add a commentAdd a comment