Amruta Fadnavis
-
సింగర్‌గా సీఎం భార్య.. భర్త కంటే ఎక్కువ సంపాదన.. ఆమె ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
‘ఆమె రీల్స్ చేస్తే.. ప్రజలేందుకు బాధ్యత తీసుకోవాలి’
ముంబై: విభజన పేరుతో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తప్పడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ మండిపడ్డారు. డీప్యూటీ సీఎం భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నప్పుడు.. మతాన్ని రక్షించే బాధ్యత ప్రజలెందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన ర్యాలీని కన్హయ్య కుమార్ మాట్లాడారు. రాజకీయ నాయకులకు అహంకారం పెరిగినప్పుడు ప్రజలు సరైన విధంగా వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. పేరు ప్రస్తావించకుండా శిక్షణ పొందిన క్లాసికల్ సింగర్, బ్యాంకర్ అయిన అమృతా ఫడ్నవిస్ (దేవేంద్ర ఫడ్నవిస్ భార్య) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారని విమర్శలు చేశారు.‘‘ఇది ధర్మయుద్ధం.. మతాన్ని రక్షించడం గురించి ప్రసంగాలు చేసే ఏ నాయకులను మీరు (ప్రజలు) ప్రశ్నించండి. మతాన్ని రక్షించే పోరాటంలో నాయకుడి స్వంత కొడుకులు, కుమార్తెలు కూడా పాల్గొంటారా? అని నిలదీయండి. అలా సాధ్యమవుతుందా? నాయకుడి పిల్లలు విదేశాల్లో చదువుతున్నప్పుడు ప్రజానీకం మతాన్ని ఎందుకు కాపాడాలి? ..ఉపముఖ్యమంత్రి భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తుంటే.. ప్రజలెందుకు మతాన్ని రక్షించే బాధ్యత తీసుకోవాలి?. అమిత్ షా కుమారుడు జై షా మతాన్ని కాపాడటానికి భాగస్వామి అవుతారా? ఆయన బీసీసీఐలో ఐపీఎల్ జట్లను ఏర్పాటు చేస్తున్నారు. డ్రీమ్ 11లో టీమ్‌లను తయారు చేయమని మనకు చెబుతున్నారు. వాళ్లు మాత్రం క్రికెటర్లు కావాలని కలలు కంటారు. మనం జూదగాళ్లుగా మిగిలిపోవాలా?’’ అని అన్నారు.చదవండి: యోగి ఆదిత్యనాథ్ విమర్శలపై మండిపడ్డ ప్రియాంక్ ఖర్గే -
ఖలునికి నిలువెల్లా విషము గదరా సుమతీ!
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత సోషల్ మీడియాలో పాపులర్. ఆమెకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. జంతుప్రేమికురాలైన అమృత పాము, ఒకరకం బల్లితో దిగిన ఫొటోలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలకు... ‘అత్యంత ప్రమాదకరమైన, విషతుల్యమైన జంతువు మనిషి మాత్రమే’ అనే కాప్షన్ ఇచ్చింది అమృత. ‘ఫోటోల కంటే మీ కాప్షన్ అద్భుతంగా ఉంది’ ‘సాటిజీవుల పట్ల మనకు ఉండాల్సిన ప్రేమను అందంగా అద్దం పట్టిన ఫొటోలు ఇవి’... అంటూ నెటిజనులు స్పందించారు. తన ట్విట్టర్ ప్రొఫైల్ బయోలో బ్యాంకర్, ప్లేబ్యాక్ సింగర్, సోషల్ వర్కర్ అని రాసుకుంది అమృత. -
అనిల్‌ను పట్టుకునేందుకు అమృత సాయం!
క్రైమ్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతను డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసిన కేసులో.. ముంబై పోలీసులు ఎట్టకేలకు కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే.. ఇందులో చాలా ఆసక్తికర విషయాల్నే పోలీసులు పొందుపరిచారు. ప్రధాన నిందితుడైన క్రికెట్ బుకీ అనిల్ జైసింఘానీని పోలీసులు.. అమృత సాయంతోనే ట్రేస్ చేసి పట్టుకున్నట్లు తెలిసింది. ఇందుకుగానూ .. అనిల్ కూతురు అనిక్షను నేరుగా కలవడంతో పాటుగా.. అమృత-అనిల్ మధ్య ఛాటింగ్‌ను సైతం పోలీసులు ఆ ఛార్జ్‌షీట్‌తో జత చేశారు. అమృతా ఫడ్నవిస్‌ను బెదిరించి.. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో అనిల్ జైసింఘానీ, అతని కుమార్తె అనిక్షపై పోలీసులు ఈ ఫిబ్రవరిలో కేసు నమోదు చేశారు. ఈలోపు అతని నేర చరిత్ర మొత్తం బయటపడింది. దాదాపుగా 15 కేసుల్లో నిందితుడిగా ఉన్న అనిల్.. ఎనిమిదేళ్ల నుంచి పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడట. దీంతో స్పెషల్ ఆపరేషన్ ద్వారా అతన్ని పట్టుకోవాలని ముంబై పోలీసులు డిసైడ్ అయ్యారు. అందుకు ఫడ్నవిస్ సతీమణి సాయం తీసుకున్నారు. ఫిబ్రవరి 24న ఛాటింగ్ అమృత: ‘‘మిమ్మల్ని అక్రమంగా కేసులో ఇరికిస్తే దాని గురించి.. నేను నా భర్త దేవేంద్ర ఫడ్నవిస్‌తో మాట్లాడతా. ఆయన మీకు న్యాయం చేస్తారు. కానీ, అక్రమంగా డబ్బు సంపాదించొచ్చన్న అనిక్ష డిమాండ్లను నేను అంగీకరించలేను. మీరు ముందు నుంచీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నారు. నేను ఏ తప్పూ చేయలేదు. ఇప్పుడు మీరు నా వీడియోలను బయటపెట్టి నన్ను ఇరికించొచ్చు. కానీ, నిజాలు ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. మీరు నిజంగా న్యాయం కోరుకుంటే దేవ్జీతో నేను మాట్లాడుతాను అవతలి నుంచి: కొన్ని డాక్యుమెంట్లు, ఆడియో మెసేజ్‌లు రిప్లైగా వచ్చాయి. ఆ తర్వాత అనిల్‌తో ఫోన్లో అమృత: ‘‘దేవేజీతో(భర్త దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఉద్దేశించి) నా బంధం సరిగా లేదు. 2019 నుంచి మా మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు కారణంగా ఆయన నాకు విడాకులిస్తారేమో!. కానీ, ఆయన గురించి నాకు తెలుసు. మీరు బాధితులని తెలిస్తే.. ఆయన 100శాతం న్యాయం జరిగేలా చూస్తారు. మరోసారి కాల్‌లోనే: ‘‘ఫోన్లో కాదు.. నేరుగా మీ అమ్మాయి అనిక్షను కలిసి మాట్లాడతా’’ అలా అనిక్ష, ఆమె తండ్రి లొకేషన్‌ను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తొలుత మార్చి 16న అనిక్షను అరెస్టు చేయగా.. ఆ తర్వాత మార్చి 19న అనిల్ జైసింఘానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇదంతా ఆమె తనంతట తానుగా చేయలేదు. ఇది కూడా పోలీసులే చెప్పమన్నారట. వాళ్ల డైరెక్షన్లోనే ఆమె ఇదంతా నడిపించారట. ఆ విషయాన్ని కూడా పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. దీనిపై ఓ దర్యాప్తు అధికారి మాట్లాడుతూ.. ‘‘మా సూచనలతోనే అమృతాజీ నిందితులతో టచ్‌లో ఉన్నారు. నిందితులను పట్టుకునేవరకు వారితో సంభాషణలు పొడగించాలని మేమే ఆమెకు చెప్పాం’’ అని తెలిపారు. కేసు వివరాలివే.. అనిక్ష తనను తాను ఫ్యాషన్డిజైనర్గా అమృతా ఫడ్నవిస్‌తో పరిచయం పెంచుకుంది. ఆ వంకతో తరచూ వాళ్ల ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో ఆమె తండ్రి ఓ బుకీ అని తెలియడంతో.. అమృతా ఆ యువతిని దూరం పెట్టింది. అదిగో అప్పటి నుంచి అమృతను డబ్బు కోసం బెదిరించడం మొదలుపెట్టింది అనిక్ష. తన తండ్రిని కేసుల నుంచి బయటపడేందుకు సాయం చేయాలని, లేదంటే పరువు తీస్తానని బెదిరించింది. అమృతకు డబ్బు ఉన్న బ్యాగును ఇస్తున్నట్లుగా ఓ నకిలీ ఆడియో, వీడియో క్లిప్పులు సృష్టించి గుర్తుతెలియని ఫోన్ నంబర్ల ద్వారా బ్లాక్మెయిల్ చేసింది. దీంతో అమృత పోలీసులను ఆశ్రయించారు. ఆపై పోలీసులు అమృత సాయంతోనే వాళ్లను పట్టుకున్నారు. -
సినిమా రేంజ్ ఛేజింగ్.. 72 గంటలు, 750 కి.మీ వెంటాడి మరీ అరెస్ట్!
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృతను డబ్బులు కోసం బ్లాక్మెయిల్ చేసిన కేసులో కీలక నిందితుడు అనిల్ జైసింఘానీను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు 72 గంటలపాటు గాలింపు చర్యలు చేపట్టి.. దాదాపు 750 కిలోమీటర్లు వెంటాడి సినీ ఫక్కీలో అతడిని అరెస్ట్ చేశారు. అసలు ఎవరీ అనిల్.. పోలీసుల అతని కోసం ఎందుకంత తీవ్రంగా శ్రమించారు? అనిల్ జైసింఘానీ కుమార్తె అనిక్ష మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్ సతీమణి అమృతతో పరిచయం ఏర్పరచుకుంది. క్రికెట్ బుకీ అయిన తన తండ్రి అనిల్‌ను కేసుల నుంచి బయటపడేయమని కోరింది. అందుకు మొదట రూ.కోటి ఇస్తానని తెలిపింది. అయితే అందుకు అమృతా నిరాకరించడంతో కొన్ని మార్ఫింగ్ వీడియోలను తయారు చేసి వాటిని లీక్ చేస్తానని అమృతపై బెదిరింపులకు పాల్పడింది. దీంతో అమృతా ఫడణవీస్ వారిపై బ్లాక్మెయిల్ బెదిరింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ గుజరాత్ వెళ్లి అనిల్ జైసింఘానిని అరెస్టు చేసింది. అనంతరం అతడిని తీసుకొచ్చి మలబార్ హిల్ పోలీస్ స్టేషన్లో అప్పగించింది. ఇలా పట్టుకున్నారు అనిల్ జైసింఘానీ చాలా ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. ఐదు రోజుల పాటు సోదాలు నిర్వహించి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి ముంబైకి తీసుకొచ్చారు. ఇన్నాళ్లుగా అనిల్ జైసింఘానీ టెక్నాలజీ సాయంతో దాక్కుంటూ వచ్చాడు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఎన్క్రిప్టెడ్ కాల్స్ చేస్తున్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ఐదు బృందాలను ఏర్పడి చివరికి అదుపులోకి తీసుకున్నారు. అతనిపై మొత్తం 15 కేసులు నమోదు కాగా అనేక ఇతర కేసులలో కూడా వాంటెడ్ గా ఉన్నాడు అనిల్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్డోలీలో అతన్ని పట్టుకోవడానికి ఉచ్చు బిగించినప్పటికీ, అతను అక్కడి నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత సూరత్ వెళ్లి అక్కడి నుంచి కూడా పారిపోయినట్లు తెలిపారు. చివరికి వడోదర, బరూచ్ మీదుగా గోద్రాకు పారిపోతుండగా అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్, కారుతో పాటు పలు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
ఆ వ్యాఖ్య ప్రధాని మోదీని అవమానించడమే: సంజయ్ రౌత్ ధ్వజం
ముంబై: ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ ప్రధాని నరేంద్ర మోదీని నవ భారత జాతిపితగా అభివర్ణించడంపట్ల శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యల్ని బీజేపీ అంగీకరిస్తే అది మోదీని తీవ్రంగా అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న నవభారతంలో ఆకలిచావులు, పేదరికం, నిరుద్యోగ్యం, ఉగ్రవాదం వంటి సమస్యలు భారీగా పెరిగిపోయాయని దుయ్యబట్టారు. ఈ మేరకు శివసేన (యూబీటీ) ప్రచార పత్రిక ‘సామ్నా’లోని సంపాదకీయంలో పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్‌ను జాతి పితగా బీజేపీలో ఏ నాయకుడు కూడా చెప్పరని, రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) ఎల్లప్పుడూ జైలుకెళ్లి శిక్ష అనుభవించిన వీర్‌సావర్కర్‌ను వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఇలాంటివారే భారతదేశాన్ని కొత్త, పాత భారతావనిగా విభజించారని చెప్పుకొచ్చారు. గాయకురాలు, బ్యాంకు అధికారి అయిన అమృత ఫడ్నవీస్ ఒక ఇంటర్వ్యూలో మన దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారని, ఒకరు పాత భారతానికి మహాత్మాగాంధీ అయితే కొత్త భారతావనికి ప్రధాని నరేంద్రమోదీ అని చెప్పారు. చదవండి: మోదీ ప్రజాదరణ, అమిత్ షా వ్యూహాలు.. 2022లోనూ తిరుగులేని బీజేపీ! అయితే అమృత వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధుల ఆత్మ బలిదానాల నుంచి లభించిన దేశ స్వాతంత్య్రాన్ని బీజేపీ గుర్తించడంలేదని విమర్శించారు. ఎనిమిదేళ్ల ప్రధాని నరేంద్రమోదీ పరిపాలనలో ప్రస్తుతం దేశంలో ఆకలిచావులు, పేదరికం, నిరుద్యోగం, ఉగ్రవాదం ప్రధానంగా పెరిగిపోయాయని, ఇలాంటి కొత్త భారతావనికి జాతిపిత మోదీ అని చెప్పడం ఆయనకు తీవ్ర అవమానమని ఎద్దేవా చేశారు. వివిధ రాజకీయ పార్టీలతోపాటుగా శివసేన పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నేత బాలాసాహెబ్ ఠాక్రే కూడా గతంలో ఇటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సంజయ్ రౌత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతావనికి జాతిపిత ఎవరనేది సమస్య కాదని, అసలు దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో బీజేపీ పాత్ర ఏంటనేదే ఇక్కడ సమస్య అని వివరించారు. బీజేపీ గానీ, దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ గానీ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఎటువంటి పాత్రపోషించలేదని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్‌తో అనుబంధమున్న సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఆదర్శనేతలను దొంగిలించి తమవారిగా చెప్పుకుంటూ బీజేపీ చరిత్రను వక్రీకరిస్తుందని సంజయ్ రౌత్ విమర్శించారు. -
మన దేశానికి ఇద్దరు పితామహులు: డిప్యూటీ సీఎం భార్య కీలక వ్యాఖ్యలు
నాగ్‌పూర్: మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్ ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర పితామహులుగా అభివర్ణించారు. మన దేశానికి ఇద్దరు పితామహులు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కాలానికి జాతి పితా మహాత్మా గాంధీ అయితే నేటీ సరికొత్త భారతావనికి పితామహులు నరేంద్ర మోదీ అంటూ ప్రధానిపై పొగడ్తలు జల్లు కురిపించారు అమృతా ఫడ్నవిస్. ఈ మేరకు అమృతా ఫడ్నవిస్ నాగ్‌పూర్ రచయితల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె నరేంద్ర మోదీని రాష్ట్ర పితాగా వ్యవహరించారు. దీంతో మరి మహాత్మా గాంధీ ఏమవుతారంటూ విలేకరులు ప్రశ్నించారు. దీంతో ఆమె సమర్థించుకుంటూ ఆ కాలంలో మహాత్మా గాంధీ జాతి పితా, ప్రస్తుతం నరేంద్ర మోదీ అంటూ కవర్ చేశారు. ఆమె ఇలా మోదీని పొగడ్తలతో ముంచెత్తడం మొదటి సారి కాదు. 2019లో ప్రధానికి పంపిన ట్విట్టర్ సందేశంలో కూడా మన దేశ పితామహుడు నరేంద్ర మోదీజీకి జన్మదిన శుభాకాంక్షలు. సమాజ అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పనిచేయడంలో మాకు స్ఫూర్తి మీరే అని పోస్ట్ చేశారు. ఆమె తరుచు ఇలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ వార్తలో నిలుస్తుంటారు. అంతకు మునుపు ఉద్ధవ్ థాక్రేపై విరుచుపడి వార్తల్లో నిలిచారు. కాగా, శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండే సీఎం కాగానే ఆమె భర్త దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యిన సంగతి తెలిసిందే. (చదవండి: ముంబైలో దారుణం..అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేసి..) -
రామ్‌దేవ్ అసభ్యకరమైన కామెంట్లు.. సారీ చెప్పాల్సిందే!
ఢిల్లీ: యోగా గురు, పతంజలి ఆయుర్వేద్ బ్రాండ్ అంబాసిడర్ బాబా రామ్‌దేవ్ మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశంలో పలు చోట్ల రామ్‌దేవ్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు పలువురు. ఈ తరుణంలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ రాందేవ్‌పై తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య(అమృతా ఫడ్నవిస్ పక్కనే ఉన్నారు ఆ టైంలో) ఎదుట స్వామి రామ్‌దేవ్.. మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమైనవి, ఖండించదగినవి కూడా. ఈ ప్రకటన పట్ల మహిళా సమాజం బాధించబడింది. కాబట్టి, దేశానికి రామ్‌దేవ్ క్షమాపణలు చెప్పాలి అని స్వాతి మలివాల్ ఓ ట్వీట్ చేశారు. మరోవైపు దేశంలో చాలా చోట్ల మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల మహిళా విభాగాలు రామ్‌దేవ్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. మహిళల దుస్తులపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కాంగ్రెస్ నిరసనలు చేసింది. రాందేవ్ బాబా దిష్టి బొమ్మ దహనం చేసి ఆందోళనల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి గీతారెడ్డి, ఇతర నేతలు. మరోవైపు సీపీఐ నారాయణ, రామ్‌దేవ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళల గురించి చాలా అన్యాయంగా మాట్లాడారని, అలాంటి వ్యాఖ్యలు చేసిన టైంలో అక్కడే ఉన్న మహిళలు అతన్ని చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాల్సిందని అభిప్రాయపడ్డారు. యోగా పేరుతో నటిస్తూ.. కార్పొరేట్ వ్యవస్థను నడుపుతున్నాడని రామ్‌దేవ్‌పై మండిపడ్డారు. అలా మొదలైంది.. ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో థానేలో జరిగిన కార్యక్రమంలో రామ్‌దేవ్ ప్రసంగిస్తూ.. మహిళలు చీరల్లో బాగుంటారని, సల్వార్, సూట్స్‌లో కూడా బాగానే కనిపిస్తారని, నా కళ్లయితే వాళ్లు దుస్తులు ధరించకున్నా బాగుంటారని వ్యాఖ్యానించారు. ఆ వీడియో బయటకు రావడంతో దుమారం మొదలైంది. శివసేన థాక్రే వర్గ నేత సంజయ్ రౌత్, బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఏం సమాధానం చెప్తారంటూ అమృతా ఫడ్నవిస్‌ను సైతం ప్రశ్నించారాయన. महाराष्ट्र के उपमुख्यमंत्री जी की पत्नी के सामने स्वामी रामदेव द्वारा महिलाओं पर की गई टिप्पणी अमर्यादित और निंदनीय है। इस बयान से सभी महिलाएँ आहत हुई हैं, बाबा रामदेव जी को इस बयान पर देश से माफ़ी माँगनी चाहिए! pic.twitter.com/1jTvN1SnR7 — Swati Maliwal (@SwatiJaiHind) November 26, 2022 సంబంధిత వార్త: మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు.. -
శివాజీ వ్యాఖ్యల దుమారం: గవర్నర్‌కు సపోర్ట్‌గా..
ముంబై: మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీపై వ్యాఖ్యలతో వివాదంలోకి దిగారు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ. ఛత్రపతి శివాజీ పాత ఐకాన్ అంటూ బహిరంగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మహా సర్కార్‌ను సైతం ఇరకాటంలో పడేశాయి. శివాజీని అగౌరవపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలో మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి.. గవర్నర్‌కు మద్దతుగా చేసిన వ్యాఖ్యలు ఆ అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. ఫడ్నవిస్ భార్య అమృత.. గవర్నర్ కోష్యారీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ‘‘వ్యక్తిగతంగా గవర్నర్‌గారు నాకు తెలుసు. మరాఠా సంస్కృతి మీద ఆయనకు ఎంతో గౌరవం ఉంది. ఆయన ఇక్కడికి వచ్చాకే మరాఠీ నేర్చుకున్నారు. మరాఠీలను ఆయన ఎంత ఇష్టపడతారో.. దగ్గరుండి మరీ చూశా. ఆయన ఏదో అన్నారని కాదు. కానీ, మనస్ఫూర్తిగా ఆయన మరాఠాను గౌరవించే మనిషే అంటూ ఆమె విలేఖరులతో చెప్పారు. ఒకవైపు శివాజీ వ్యాఖ్యల ఆధారంగా గవర్నర్‌పై మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. గవర్నర్ రీకాల్ కోసం ప్రయత్నించాలని మహా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. ఈ తరుణంలో.. అమృతా ఫడ్నవిస్ వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు బీజేపీని, బీజేపీ-షిండే శివసేన కూటమి సర్కార్‌ను మరింత ఇరకాటంలో పడేశాయి. ప్రతిపక్షాలు అమృత కామెంట్ల ఆధారంగా బీజేపీపై విరుచుకుపడుతున్నారు. మరోవైపు ఉద్దవ్ థాక్రే.. కేంద్రం అమెజాన్ పార్శిల్లో కోష్యారీని పంపించిందంటూ ఎద్దేవా చేశారు. కోష్యారీని తప్పించకపోతే.. అన్ని పార్టీలను పోగుజేసి వ్యతిరేక నిరసనలు కొనసాగిస్తామని థాక్రే హెచ్చరించారు. కేంద్రాన్ని ఉద్దేశిస్తూ.. ‘‘మీరు పంపిన శాంపిల్‌ను మీరే తీసుకెళ్లండి. ఒకవేళ ఆయన్ని ఓల్డేజ్ హోంకి పంపించాల్సి వస్తే ఆ పని చేయండి. అంతేకానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఆయన్ని ఉంచకండి అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు థాక్రే. మరోవైపు గవర్నర్ వ్యాఖ్యలపై నిరసన కోసం.. థాక్రే శివసేన వర్గపు నేత సంజయ్ రౌత్.. కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్‌ను కలిసి చర్చించారు. ఇదిలా ఉండగా.. శివాజీపై వ్యాఖ్యల నేపథ్యంలో గవర్నర్ కోష్యారీని కేంద్రం ఢిల్లీకి పిలిపించుకున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: శివాజీపై గవర్నర్ వ్యాఖ్యలు.. గడ్కరీ ఏమన్నారంటే.. -
రెండేళ్లుగా అమృతపై అసభ్యకరమైన కామెంట్లు
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ వస్తున్న ఓ మహిళను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్లుగా ఆమె ఈ పని చేస్తూ వస్తోంది. చివరకు సైబర్ పోలీసుల జోక్యంతో ఆమె కటకటాల వెనక్కి వెళ్లింది. అమృత ఫడ్నవిస్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్నది తెలిసిందే. అయితే.. స్మృతి పాంచోల్ అనే మహిళ గత రెండేళ్లుగా రకరకాల అకౌంట్లతో అమృత ఫేస్బుక్, ట్విటర్ అకౌంట్లలో అసభ్యకరమైన, అనుచితమైన కామెంట్లు చేస్తూ వస్తోంది. సుమారు 50 ఏళ్ల వయసున్న నిందితురాలు.. గత రెండేళ్లలో ఆమె 53 ఫేక్ ఎఫ్బీ ఐడీలు, 13 జీమెయిల్ అకౌంట్లు వాడినట్లు సైబర్ పోలీసులు గుర్తించారు. ఐపీసీ 419, 468 సెక్షన్ల ప్రకారం, అలాగే ఐటీ యాక్ట్ ప్రకారం ఆమెపై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం నిందితురాలు కోర్టు రిమాండ్‌లో ఉండగా.. అసలు ఆమె అలా చేయడానికి కారణాలేంటి? ఆమె వెనుక ఎవరున్నారనే విషయాలను తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. ఇదీ చదవండి: స్నేక్‌మ్యాన్ వినోద్.. పాపం కళ్ల ముందే కుప్పకూలాడు -
ఉద్దవ్ థాక్రేపై ఫడ్నవీస్ భార్య ట్వీట్!
ముంబై: సంక్షోభం అంచునకు మహారాష్ట్ర రాజకీయం చేరుకుంది. శివ సేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో దాదాపు మైనార్టీ దిశగా అడుగులు వేస్తోంది ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం. ఈ క్రమంలో.. సీఎం ఉద్దవ్ థాక్రేపై మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఏక్ థా కపటి రాజా.. అంటూ ‘థా’ అనే పదానికి స్పెషల్‌గా కోట్స్ మెన్షన్ చేసింది ఆమె. అది థాక్రేను ఉద్దేశించిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. విమర్శలు వెల్లువెత్తడంతో కాసేపటికే ఆమె ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. మహా వికాస్ అగాఢి కూటమి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని, కాంగ్రెస్.. ఎన్సీపీతో దోస్తీ కట్ చేసుకోవాలని, బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని 40 మంది ఎమ్మెల్యేలతో(అందులో ఇతరులు కూడా ఉన్నారు) కలిసి ఏక్నాథ్ షిండే తిరుగుబాటు బావుటా ఎగరేశారు. అయితే షిండేకు, బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకుండా.. అసెంబ్లీనే రద్దు చేసే యోచనలో ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. -
‘ట్రాఫిక్ కారణంగా విడాకులు తీసుకుంటున్నారు’
ట్రాఫిక్ కారణంగానే ముంబైలో మూడు శాతం మంది విడాకులు తీసుకుంటున్నారని మహారాష్ట్ర మాజీ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ అన్నారు. ఆర్థిక రాజధానిలో రోడ్ల పరిస్థితిని గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఈ విధంగా విచిత్రమైన వాదనను వినిపించారు. అంతేకాదు తాను దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అనే విషయం మరచిపోండి. ఒక మహిళగా మీతో మాట్లాడుతున్నాను. గుంతలు, ట్రాఫిక్‌తో తాను వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. పైగా ఈ ట్రాఫిక్ కారణంగానే కుటుంబంతో గడిపే సమయం లేకపోవడంతో చాలామంది విడాకులు తీసుకుంటున్నారని ఒక విచిత్రమైన లాజిక్‌ని చెప్పారు. దీంతో శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ఆమె పేరు ఎత్తకుండానే సోషల్ మీడియా వేదికగా ఆమె స్టేట్మెంట్పై విరుచుకుపడ్డారు. అంతేకాదు ట్రాఫిక్ కారణంగా విడాకులు తీసుకుంటున్నారన్న మహిళకు ది బెస్ట్ లాజిక్ ఆఫ్ ది డే అవార్డును అందజేయాలంటూ వ్యంగ్యంగా కౌంటరిచ్చారు. అంతేకాదు బెంగుళూరు కుటుంబాలు ఈ స్టేట్మెంట్ని క్లైయిమ్ చేసుకుంటారే ఏమో! జాగ్రత్తా అంటూ ప్రియాంక చతుర్వేది చమత్కరించారు. పైగా విడాకులు తీసుకోవడంపై దృష్టి సారించకుండా కుటుంబంతో గడిపేందుకు హాలీడే బ్రేక్ తీసుకోండి అన్నారు. అంతేకాదు దయచేసి ఈ విచిత్రమైన స్టేట్మెంట్ని అనుకరించకండి మీ వివాహబంధానికి ప్రాణాంతకం కావచ్చు అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలతో విమర్శిస్తూ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. #WATCH: BJP leader Devendra Fadnavis' wife Amruta Fadnavis says, "I'm saying this as common citizen. Once I go out I see several issues incl potholes,traffic. Due to traffic,people are unable to give time to their families & 3% divorces in Mumbai are happening due to it." (04.02) pic.twitter.com/p5Nne5gaV5 — ANI (@ANI) February 5, 2022 Best (il)logic of the day award goes to the lady who claims 3% Mumbaikars are divorcing due to traffic on roads. Please take a holiday break rather than having a mind on brake.. Bengaluru families please avoid reading this , can prove fatal for your marriages 😂 — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) February 5, 2022 (చదవండి: నామినేషన్ దాఖలు చేసేందుకు పరుగులు పెట్టిన యూపీ క్రీడా మంత్రి) -
సోషల్ మీడియాలో మాజీ సీఎం భార్య రచ్చ.. ‘ఆ డ్రెస్ ఏంటి’
Devendra Fadnavis Wife Amruta Fadnavis Song Manike Mage Hithe in New Viral Video: సోషల్ మీడియా వాడకంతో సినీ, రాజకీయ ప్రముఖులు తమ అభిమానులకు మరింత దగ్గరయ్యే అవకాశాలు పెరిగాయి. తమకు సంబంధించిన ప్రతి అంశాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే దీని వల్ల లాభంతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఏదైనా మంచి చేస్తే ప్రశంసలు.. పిచ్చి వేశాలు వేస్తే.. విమర్శలు కూడా ఆ రేంజ్‌లోనే ఉంటాయి. ఇప్పుడీ టాపిక్ ఎందుకంటే.. తాజాగా మాజీ ముఖ్యమంత్రి భార్య సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. అయితే వీడియోలో ఆమె డ్రెస్సింగ్ చూసి జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ వివరాలు.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఆమెకు సంభంధించిన ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా అమృత ఫడ్నవీస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేశారు. అది ఇప్పుడు తెగ వైరలవ్వడంతో పాటు విమర్శల పాలు చేస్తోంది. (చదవండి: Devendra Fadnavis: మీ భార్యలు కొట్టినా మోదీ బాధ్యతేనా?) సింహళ పాట మణికే మాగే హితే ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పాట పలు వర్షన్లు.. వేరు వేరు భాషల్లోకి డబ్ అవ్వడమే కాక అక్కడ కూడా హిట్ అయ్యింది. ఈ క్రమంలో తాజాగా అమృత ఫడ్నవీస్ కూడా ఈ పాటకు తనదైన శైలీలో కొన్ని మార్పులు చేయడమే కాక స్వయంగా ఆడి పాడారు. హిందీలో పాడిన ఈ పాట కోసం అమృత ఎరుపు రంగు టైట్ ప్యాంట్, టీ షర్ట్.. దాని మీద తెలుపు రంగు షర్ట్ ధరించారు. (చదవండి: ‘మణికే మాగే హితే’ యొహానీకి బాలీవుడ్ బంపర్ ఆఫర్) అమృత గాత్రం, ఆమె ఎక్స్ప్రెషన్స్ అన్ని సూపర్‌గా ఉన్నాయి. కానీ ఆమె ధరించిన బట్టలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. మాజీ సీఎం భార్య.. అంటే ఎంత పద్దతిగా ఉండాలి.. మరీ ఇంత అతి అవసరం లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: పెళ్లిలో డ్యాన్స్‌తో దుమ్మురేపిన వదిన.. అందరి చూపు ఆమె వైపే View this post on Instagram A post shared by Amruta Fadnavis (@amruta.fadnavis) -
‘ముంబై మానవత్వం కోల్పోయింది’
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ ముంబై నగరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై తన మానవత్వాన్ని కోల్పోయిందన్నారు. సుశాంత్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు ఆమె కుటుంబసభ్యుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అలాగే దర్యాప్తు విషయంలో బిహార్, మహారాష్ట్ర పోలీసుల మధ్య కోల్డ్ వారికి దారితీసింది. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసులో ముంబై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే జీవించడానికి ముంబై మహానగరం సురక్షితం కాదనిపిస్తోందన్నారు. (నొప్పి లేకుండా చనిపోవడం ఎలా?.. గూగుల్‌లో సుశాంత్ సెర్చ్) ‘సుశాంత్ సింగ్ కేసులో పోలీసులు వ్యవహిరిస్తున్న తీరు చూస్తే ముంబై మానవత్వం కోల్పోయినట్లు అనిపిస్తోంది. ఇక్కడ అమాయక ప్రజలు, ఆత్మగౌరవం ఉన్నవారు జీవించడం సురక్షితం కాదు’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలను శివసేన, ఎన్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. అమృత ఫడ్నవిస్ వ్యాఖ్యలను శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేదీ తప్పు పట్టారు. రాష్ట్ర బీజేపీ నాయుకులు రాజకీయం చేస్తూ ముంబై పోలీసులను నిందిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల పరువు తీసేవిధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పోలీసులను నిందించే వారు తమ భద్రత కోసం ప్రైవేట్ సిబ్బందిని నియమించుకోవాలన్నారు. మాజీ సీఎం భార్యగా అమృత ఫడ్నవిస్ పోలీసులను నిందించటం సిగ్గుచేటన్నారు. -
రశ్మికు అమృత ఫడ్నవిస్ అభినందనలు..
సాక్షి, ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రశ్మి ఠాక్రే శివసేన అధికార పత్రిక సామ్నా ఎడిటర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ స్పందించారు. సామ్నా ఎడిటర్‌గా బాధ్యతలు స్పీకరించినందుకు రశ్మికి అభినందనలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళ ప్రాతినిథ్యం పెరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలు ముఖ్య స్థానాల్లో ఉంటేనే వారి అభిప్రాయాలను స్పష్టంగా బయటపెట్టగలరని పేర్కొన్నారు. ఈ మేరకు అమృత తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. (సామ్నా ఎడిటర్‌గా రశ్మి ఠాక్రే) కాగా ఆదివారం వెలువడిన సామ్నా పేపర్లో రశ్మిని ఎడిటర్‌గా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సామ్నా ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ రశ్మినే కావడం విశేషం. మరోవైపు శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ యథావిథిగా సామ్నా కార్యనిర్వహక ఎడిటర్‌గా కొనసాగనున్నారు. -
ఉద్ధవ్‌పై అమృత సంచలన వ్యాఖ్యలు..
ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ కొద్ది రోజులుగా అధికార శివసేనపై సోషల్ మీడియాలో మాటల యుద్దం కొనసాగిస్తున్నారు. పుణె మున్సిపల్ కార్పొరేషన్లో అధికారంలో ఉన్న శివసేన.. ఆ సంస్థ ఉద్యోగులకు జీతాలకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను యాక్సిస్ బ్యాంక్ నుంచి వేరే జాతీయ బ్యాంక్‌కు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే యాక్సిస్‌లో సీనియర్ అధికారిణిగా ఉన్న అమృత.. శివసేన నిర్ణయంపై ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను లక్ష్యంగా చేసుకుని ట్విటర్లో పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా ఉద్ధవ్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఒక చెడ్డ నాయకుడిని కలిగి ఉండటం మహారాష్ట్ర తప్పు కాదు. అయితే ఆ నాయకుడికి మద్దతు ఇవ్వడం తప్పు’ అంటూ అమృత ట్వీట్ చేశారు. జాగో మహారాష్ట్ర అని పిలుపునిచ్చారు. అంతేకాకుండా తాను ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూను కూడా పోస్ట్ చేశారు. ‘నేను దేవేంద్ర ఫడ్నవీస్‌ను పెళ్లి చేసుకోక ముందు నుంచే పుణె మున్సిపల్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు యాక్సిస్ బ్యాంక్‌లో కొనసాగుతున్నాయి. గతంలో కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అవి అలాగే ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకులు కూడా భారత్‌కు చెందినవే. అవి ఉన్నతమైన సాంకేతికతో కూడిన సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వం హేతుబద్ధంగా ఆలోచించాలి. ఇలా చేయడం ద్వారా వారు నా భర్తను, నన్ను టార్గెట్ చేస్తున్నారు. దేవేంద్ర ఎప్పుడూ వ్యక్తులను లక్ష్యంగా చేసుకోని పనిచేయలేదు. శివసేన చేస్తున్నది భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకం. మేము దీనిపై మౌనంగా ఉండదలచుకోలేదు. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా ప్రజలకు హాని చేసేలా ఉందని భావిస్తే.. వాటిపై పోరాటం కొనసాగిస్తాను’ అని తెలిపారు. గతంలో కూడా అమృత.. పేరు చివర ఠాక్రే అని పెట్టుకున్నంతా మాత్రాన ప్రతి ఒక్కరు ఠాక్రేలు అయిపోరు అంటూ ఉద్ధవ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అమృత వ్యాఖ్యలపై శివసేన నేతలు మండిపడుతున్నారు. ఆమెకు కౌంటర్‌గా కామెంట్లు పెడుతున్నారు. -
అది బ్యాంక్ ఉద్యోగి పనికాదు..
ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్, శివసేన నేత ప్రియాంక చతుర్వేదిల మధ్య సంవాదం ముదురుతోంది. తనను టార్గెట్ చేస్తున్నారన్న అమృత వ్యాఖ్యలపై ప్రియాంక తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. థానే మున్సిపల్ కార్పొరేషన్ ఖాతాలను యాక్సిస్ బ్యాంక్ నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులకు మార్చాలని థానే మేయర్ తీసుకున్న నిర్ణయం వివాదానికి కేంద్ర బిందువైంది. అమృత ఫడ్నవీస్ యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగి అయినందునే అప్పట్లో యాక్సిస్ బ్యాంకుకు థానే మున్సిపల్ కార్పొరేషన్ ఖాతాలను మళ్లించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. యాక్సిస్ బ్యాంకుకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రియాంక సందేహం వ్యక్తం చేశారు. యాక్సిస్ బ్యాంకుకు ఖాతాలు బదలాయించిన తర్వాత బ్యాంకు సీఎస్ఆర్ నిధుల నుంచి బీజేపీ పథకాలకు ఎంత నిధులు వచ్చాయనేది విచారణలో నిగ్గుతేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రజలకు సలహాలివ్వడం, బోధనలు చేయడం యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగి పరిధిలోకి రాని అంశాలని అమృతా ఫడ్నవీస్‌కు ప్రియాంక చతుర్వేది చురకలు అంటించారు. మరోవైపు ఖాతాలను జాతీయ బ్యాంకులకు బదలాయించాలని, యాక్సిస్ బ్యాంక్‌ను పోషించింది చాలని బీఎంసీ సేన కార్పొరేటర్ సమాధాన్ సర్వంకర్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కోరారు. ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్‌లో ఫడ్నవీస్ భార్య పనిచేస్తున్నందునే ప్రభుత్వ ఖాతాలను ఆ బ్యాంకుకు మళ్లించారని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. చదవండి : యాక్సిస్‌కు దూరమైన ‘అమృత’ ఘడియలు! -
‘అదో రోగం.. అవును త్వరగా కోలుకోండి’
థానే: యాక్సిస్ బ్యాంక్‌లో సీనియర్ అధికారిణి అయిన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతకు, శివసేన డిప్యూటీ నేత ప్రియాంక చతుర్వేదికి మధ్య ట్విటర్ వేదికగా గొడవ తలెత్తడంతో యాక్సిస్ బ్యాంక్‌కు తలనొప్పి తెస్తోంది. ఏడాదికి రూ.11వేల కోట్ల లావాదేవీలుండే మహారాష్ట్ర పోలీసు విభాగం తన వేతన ఖాతాలను వేరే బ్యాంక్‌కు మార్చనుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు తాజాగా శివసేన చేతుల్లోని థానే మున్సిపల్ కార్పొరేషన్ సైతం తన ఉద్యోగుల వేతన ఖాతాలను యాక్సిస్ నుంచి మరో బ్యాంక్‌కు మార్చాలని నిర్ణయించుకుంది. ‘నా పేరు రాహుల్ సావర్కర్ కాదు’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను అమృత విమర్శించడంతో వివాదం ముదిరింది. తన పేరు వెనుక ఠాక్రే ఇంటి పేరు తగిలించుకున్న వ్యక్తి విలువలకు తిలోదకాలు ఇచ్చి సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేశారంటూ పరోక్షంగా ఉద్ధవ్‌పై విమర్శలు చేశారు అమృత. దీనికి ప్రియాంక సమాధానం ఇస్తూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలలోపే రైతు రుణాలు మాఫీ చేశారని, మహారాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఉద్ధవ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. అంతకుముందు కూడా అమృత, ప్రియాంకల మధ్య ట్విటర్ వార్ జరిగింది. బాల్ ఠాక్రే మెమొరియల్ కోసం ఔరంగాబాద్‌లోని ప్రియదర్శిని పార్క్‌లో వెయ్యి చెట్లను నేలమట్టం చేయనున్నారని వార్తలు వచ్చినప్పడు శివసేన పార్టీని విమర్శిస్తూ అమృత ట్వీట్ చేశారు. ఆరే ప్రాంతంలో చెట్ల కూల్చివేతను వ్యతిరేకించిన శివసేన.. ఔరంగాబాద్‌లో చెట్ల నరికివేతకు పూనుకోవడాన్ని విమర్శిస్తూ.. ‘సంకుచిత్వం అనేది వ్యాధి లాంటిద’ని అమృత పేర్కొన్నారు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. ‘ఒక్క చెట్టు కూడా కొట్టేయడం లేదని ఔరంగాబాద్ మేయర్ ధ్రువీకరించారు. పదేపదే అబద్ధాలాడటం పెద్ద రోగం. ఈ వ్యాధి నుంచి త్వరగా కోలువాల’ని ట్వీట్ చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. -
అమృత ఫడ్నవీస్ కవితాత్మక వీడ్కోలు..
ముంబై : బలపరీక్షకు ముందే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన భార్య అమృత ఫడ్నవీస్ కవితాత్మక ధోరణిలో ట్వీట్ చేశారు. త్వరలోనే వసంతం తిరిగివచ్చి కొమ్మలపై సువాసనను వెదజల్లుతుందని, ఇది శరధ్రుతువని వాతావరణంలో మార్పు కోసం వేచిచూస్తామని అమృత ఫడ్నవీస్ హిందీలో ట్వీట్ చేశారు. ఐదేళ్లుగా మీరు నాపై చూపిన ప్రేమ ఎప్పటికీ గుర్తుంటుందని, అందుకు మహారాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలని పేర్కొన్నారు. ప్రజలకు తన సాధ్యమైనంత మేర సానుకూల మార్పు దిశగా పనిచేసేందుకు తాను ప్రయత్నించానని ఆమె చెప్పుకొచ్చారు. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా బలపరీక్ష ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన క్రమంలో 80 గంటల పాటు సీఎం పదవిలో ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేయడంతో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరేందుకు మార్గం సుగమమైంది. पलट के आऊंगी शाखों पे खुशबुएँ लेकर, खिज़ां की ज़द में हूँ मौसम ज़रा बदलने दे! Thanks Mah for memorable 5yrs as your वहिनी !The love showered by you will always make me nostalgic! I tried to perform my role to best of my abilities-with desire only to serve & make a positive diff🙏 pic.twitter.com/ePUzQgR9o5 — AMRUTA FADNAVIS (@fadnavis_amruta) November 26, 2019 -
ప్రధానికి విషెస్; సీఎం భార్యపై విమర్శలు!
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీని.. ‘ఫాదర్ ఆఫ్ కంట్రీ’గా సంభోందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. మన జాతి పిత మహాత్మా గాంధీ అని.. ఆ విషయాన్ని కాస్త గుర్తు పెట్టుకుంటే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. అసలు విషయమేమిటంటే... మంగళవారం మోదీ 69వ పుట్టిన రోజు సందర్భంగా అమృత సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు...‘ ఫాదర్ ఆఫ్ కంట్రీ నరేంద్ర మోదీ జీకి జన్మదిన శుభాకాంక్షలు. సమాజాన్ని మెరుగుపరిచే క్రమంలో నిర్విరామంగా కృషి చేసేందుకు స్ఫూర్తినిస్తున్న వ్యక్తి ఆయన’ అని ఆమె ట్వీట్ చేశారు. విషెస్‌తో పాటు తాను స్టేజీపై గాన ప్రదర్శన ఇస్తున్న వీడియోను కూడా అమృత జతచేశారు. ఈ క్రమంలో అమృత ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు...‘ మన జాతి పిత మహాత్మా గాంధీ అని తెలుసు. ఇప్పుడు కొత్తగా నరేంద్ర మోదీ దేశానికి తండ్రి అయ్యారా. ఇది ఎప్పుడు జరిగింది? ఓహో దేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం పెరగడం, ఆర్థిక వ్యవస్థ కుదేలవడం, ఆర్థిక మాంద్యం.. బహుశా ఇదేనేమో సమాజాన్ని మెరుగుపరచటం అంటే’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా 2016లో నేపథ్య గాయనిగా రంగ ప్రవేశం చేసిన అమృత పలు గీతాలు ఆలపించి సింగర్‌గా గుర్తింపు పొందారు. అదే విధంగా సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. ఇక అమృత నెటిజన్ల ఆగ్రహానికి గురి కావడం ఇదే మొదటిసారి కాదు. గత అక్టోబరులో క్రూయిజ్ షిప్ అంచున కూర్చుని సెల్ఫీలకు ఫోజులిచ్చి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇందుకు ఆమె క్షమాపణలు కూడా కోరారు. Wishing the Father of our Country @narendramodi ji a very Happy Birthday - who inspires us to work relentlessly towards the betterment of the society ! #HappyBDayPMModiJi #HappyBdayPMModi #HappyBirthdayPM #happybirthdaynarendramodi pic.twitter.com/Ji2OMDmRSm — AMRUTA FADNAVIS (@fadnavis_amruta) September 17, 2019 -
తప్పైతే క్షమించండి : సీఎం భార్య
ముంబై : సెల్ఫీ కోసం రూల్స్ బ్రేక్ చేసిన మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ ఎట్టకేలకు క్షమాపణలు కోరారు. భారత్ తొలి దేశియ క్రూయిజ్ ఆంగ్రియా ప్రారంభం సందర్భంగా ఆమె భద్రతా వలయాన్ని దాటి సెల్ఫీ తీసుకున్నారు. దీనిపై సర్వతా విమర్శలు రావడంతో క్షమాపణలు కోరారు. ‘ ఎవరైనా నేను చేసింది తప్పుని భావిస్తే దానికి నేను క్షమాపణలు చెబుతున్నా. నేను యువతకు చెప్పేది ఒకటే.. సెల్ఫీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.’ అని ఓ మరాఠీ ఛానల్‌కు తెలిపారు. అయితే తాను సెల్ఫీ దిగిన ప్రాంతం అంతప్రమాదకరమైనదేం కాదని తన చర్యను సమర్ధించుకున్నారు. గత శనివారం భారత్ తొలి దేశియ క్రూయిజ్ ఆంగ్రియాలో ప్రయాణించిన ఆమె పర్ఫెక్ట్ సెల్ఫీ కోసం రక్షణ గోడ దాటారు. భద్రతా సిబ్బంది ఎంత వారించిన ఆమె పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేయడంతో ఈ ఘటనపై సర్వత్రా విమర్శలొచ్చాయి. క్రూయిజ్ టూరిజాన్ని వృద్ధి చేయడంలో భాగంగా ఈ షిప్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి: సెల్ఫీ కోసం సీఎం భార్య రూల్స్ బ్రేక్ -
సెల్ఫీ కోసం సీఎం భార్య రూల్స్ బ్రేక్
ముంబై : సెల్ఫీ.. ప్రస్తుతం అందరికి ఓ ఫ్యాషన్‌గా మారింది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఒక్క క్లిక్కుమనిపించి వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అందరికి ఓ అలవాటైంది. మితిమీరిన ఈ ఫ్యాషన్‌తో కొంతమంది ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. ఈ ట్రెండ్ సెలబ్రిటీలకు మినహాయింపు కాదు. ఇలానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత సైతం సెల్ఫీ కోసం రూల్స్ బ్రేక్ చేశారు. భారత్ తొలి దేశియ ప్రయాణీకుల నౌక ఆంగ్రియాలో ప్రయాణించిన ఆమె పర్ఫెక్ట్ సెల్ఫీ కోసం రక్షణ గోడ దాటారు. భద్రతా సిబ్బంది ఎంత వారించిన ఆమె పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సరదాగా కామెంట్ చేస్తుంటే మరికొందరు ఆమె చర్యను తప్పుబడుతున్నారు. క్రూయిజ్ టూరిజాన్ని వృద్ధి చేయడంలో భాగంగా శనివారం ఈ షిప్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. #WATCH: Amruta Fadnavis, wife of Maharashtra CM Devendra Fadnavis, being cautioned by security personnel onboard India's first domestic cruise Angria. She had crossed the safety range of the cruise ship. pic.twitter.com/YYc47gLkHd — ANI (@ANI) October 21, 2018 -
సీఎం భార్య పెళ్లికి ముందు హిందువేనా?
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ తీరుపట్ల సోషల్ మీడియాలోని ఓ వర్గం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. క్రిస్మస్ దృక్పథంతో రూపొందించిన ఓ స్వచ్ఛంద సేవ కార్యక్రమాన్ని ఆమె ప్రమోట్ చేస్తుండటంతో కొందరు ఆమెపై సోషల్ మీడియాలో అక్కసు వెళ్లగక్కుతున్నారు. launched-Be Santa-campaign, as Ambassador for @927BIGFM - to collect gifts from people -for poor children ,to bring smiles to their faces during this Christmas.Drop ur gifts at nearest @927BIGFM & Feel the joy -as best way to multiply your happiness is by sharing it with others🎅 pic.twitter.com/r5UTAi3nDY — AMRUTA FADNAVIS (@fadnavis_amruta) December 12, 2017 ఓ ఎఫ్ఎం రేడియో చానెల్.. ‘బీ సాంటా’ పేరిట నిరుపేద పిల్లలకు కానుకలు అందించేందుకు చేపట్టిన కార్యక్రమంలో అమృత పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలతో ఆమె ట్వీట్ చేయగా.. దీనిపై కొందరు అక్కసు వెళ్లగక్కారు. సీఎం, సీఎం సతీమణి తీరును తప్పుబడుతూ విమర్శలు చేశారు. పెళ్లికి ముందు అమృత ఫడ్నవిస్ అసలు హిందువునే అని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సీఎం కెరీర్‌కు అంతమంచిది కాదని కొందరు హితవు పలికారు. అమృత ఫడ్నవిస్ హిందూ పండుగలపై ఎక్కువగా ఫోకస్ చేయాలని ఇంకొందరు సూచించారు. ఈ వివాదం ముదరడంతో దీనిపై అమృత ట్వీట్ చేశారు. ‘ప్రేమ, అభిమానం, సానుభూతి వంటి భావనలకు మతం ఉండదు. సానుకూలత ఎక్కడ ఉన్నా స్వీకరిద్దాం. ప్రతికూల, చెడు ఆలోచనలకు దూరం జరుగుదాం’ అని ఆమె పేర్కొన్నారు. ‘ఒక హిందువును అయినందుకు నేను గర్విస్తున్నాను. చాలామంది తరహాలోనే నేను దేశంలోని ప్రతి పండుగను జరుపుకుంటాను. మన దేశీయ స్ఫూర్తికి మనం ప్రాతినిధ్యం వహించాలి. అంతమాత్రన మన దేశం, మతం, మానవత్వం నుంచి వెనుకకు తగ్గినట్టు కాదు’ అని ట్వీట్ చేశారు. I’m a proud Hindu & like many, I celebrate every festival in my country & that is an individual choice.... We represent the true spirit of our country ... and that doesn’t dilute our love towards our country, religion & humanity .... — AMRUTA FADNAVIS (@fadnavis_amruta) December 12, 2017 -
బర్రెల్ని పంపిణీ చేసిన సీఎం సతీమణి
నాగ్‌పూర్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పేదలకు బర్రెల్ని పంపిణీచేసి ఆదర్శంగా నిలిచారు అమృతా ఫడ్నవిస్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణిగానే కాక బ్యాంకర్, సింగర్, సోషల్ వర్కర్‌గా బహుముఖ ప్రజ్ఞతో నిత్యం వార్తల్లో నిలిచే ఆమె మరోసారి తనదైన శైలిని కనబర్చారు. ‘శ్రీమంతుడు’ తరహాలో నాగ్‌పూర్ జిల్లాలోని కవ్దాస్ గ్రామాన్ని దత్తత తీసుకున్న అమృత ఫడ్నవిస్.. గాంధీ జయంతి సందర్భంగా సోమవారం గ్రామంలో పర్యటించారు. భర్తలను కోల్పోయిన పలువురు పేద మహిళలకు బర్రెలను పంచారు. అనంతరం నీటిశుద్ధీకరణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అధికార బీజేపీ ప్రభుత్వం సైతం బర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, సీఎం సతీమణి పంచిన బర్రెలు ప్రభుత్వ పథకంలో భాగంగానా లేక వ్యక్తిగతంగానా అనేది తెలియాల్సిఉంది. #GandhiJayanti wishes!Gave buffaloes to widows & poor women & inauguratd drinking water plant at my adopted village Kawdas @Dev_Fadnavis 🙏🙏 pic.twitter.com/vrvGRGFIQ1 — AMRUTA FADNAVIS (@fadnavis_amruta) 2 October 2017 -
న్యూయార్క్ ఫ్యాషన్ షోలో సీఎం భార్య!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ గురువారం న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ మీద కనిపించనున్నారు. పుణెకు చెందిన ఓ డిజైనింగ్ ఇన్ స్టిట్యూట్ తరఫున ఆమె షోస్టాపర్ గా కనువిందు చేయనున్నారు. బాలికల విద్యను, చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు ఆమె ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. యువ డిజైనర్ల ప్రతిభను చాటేందుకు పుణెకు చెందిన ఛేసా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ టెక్నాలజీ సంస్థ ఈ ఫ్యాషన్ షోను నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో రైతులు, కూలీల పిల్లలు రూపొందించిన చేనేత వస్త్రాలను ప్రదర్శించనున్నారు. ఇండో-వెస్ట్రన్ శైలిలో రూపొందించిన ఓ విశిష్టమైన చేనేత వస్త్రాన్ని ధరించి అమృత ఫడ్నవిస్ ర్యాంప్ మీద కనిపించనున్నారు. 'బాలికల విద్యను ప్రోత్సహించాలన్న సందేశంతో నేను ర్యాంప్ మీద నడవబోతున్నాను. నిజానికి ఈ చేనేత వస్త్రాలను రైతులు, రైతు కూలీల పిల్లలు రూపొందించారు. వారి ప్రతిభను లోకానికి చాటే ఈ కార్యక్రమం గొప్ప వినూత్నమైనది. ఒక బాలికను చదివిస్తే కుటుంబాన్ని చదివించినట్టు అవుతుంది. కుటుంబమంతా విద్యావంతులైతే అప్పుడు దేశం పురోగమిస్తుంది.' అని అమృత ఫడ్నవిస్ మీడియాతో తెలిపారు. గతంలో గిరిజన కళలతో కూడిన చేనేత వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ చేసిన ఆమె.. ఈసారి యువ డిజైనర్లను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నట్టు తెలిపారు.