ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ వస్తున్న ఓ మహిళను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్లుగా ఆమె ఈ పని చేస్తూ వస్తోంది. చివరకు సైబర్ పోలీసుల జోక్యంతో ఆమె కటకటాల వెనక్కి వెళ్లింది.
అమృత ఫడ్నవిస్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్నది తెలిసిందే. అయితే.. స్మృతి పాంచోల్ అనే మహిళ గత రెండేళ్లుగా రకరకాల అకౌంట్లతో అమృత ఫేస్‌బుక్, ట్విటర్ అకౌంట్లలో అసభ్యకరమైన, అనుచితమైన కామెంట్లు చేస్తూ వస్తోంది.
సుమారు 50 ఏళ్ల వయసున్న నిందితురాలు.. గత రెండేళ్లలో ఆమె 53 ఫేక్ ఎఫ్‌బీ ఐడీలు, 13 జీమెయిల్ అకౌంట్లు వాడినట్లు సైబర్ పోలీసులు గుర్తించారు. ఐపీసీ 419, 468 సెక్షన్‌ల ప్రకారం, అలాగే ఐటీ యాక్ట్ ప్రకారం ఆమెపై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం నిందితురాలు కోర్టు రిమాండ్‌లో ఉండగా.. అసలు ఆమె అలా చేయడానికి కారణాలేంటి? ఆమె వెనుక ఎవరున్నారనే విషయాలను తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు.
ఇదీ చదవండి: స్నేక్‌మ్యాన్ వినోద్.. పాపం కళ్ల ముందే కుప్పకూలాడు
Comments
Please login to add a commentAdd a comment