
Devendra Fadnavis Wife Amruta Fadnavis Song Manike Mage Hithe in New Viral Video: సోషల్ మీడియా వాడకంతో సినీ, రాజకీయ ప్రముఖులు తమ అభిమానులకు మరింత దగ్గరయ్యే అవకాశాలు పెరిగాయి. తమకు సంబంధించిన ప్రతి అంశాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే దీని వల్ల లాభంతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఏదైనా మంచి చేస్తే ప్రశంసలు.. పిచ్చి వేశాలు వేస్తే.. విమర్శలు కూడా ఆ రేంజ్‌లోనే ఉంటాయి. ఇప్పుడీ టాపిక్ ఎందుకంటే.. తాజాగా మాజీ ముఖ్యమంత్రి భార్య సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. అయితే వీడియోలో ఆమె డ్రెస్సింగ్ చూసి జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ వివరాలు..
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఆమెకు సంభంధించిన ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా అమృత ఫడ్నవీస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేశారు. అది ఇప్పుడు తెగ వైరలవ్వడంతో పాటు విమర్శల పాలు చేస్తోంది.
(చదవండి: Devendra Fadnavis: మీ భార్యలు కొట్టినా మోదీ బాధ్యతేనా?)
సింహళ పాట మణికే మాగే హితే ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పాట పలు వర్షన్‌లు.. వేరు వేరు భాషల్లోకి డబ్ అవ్వడమే కాక అక్కడ కూడా హిట్ అయ్యింది. ఈ క్రమంలో తాజాగా అమృత ఫడ్నవీస్ కూడా ఈ పాటకు తనదైన శైలీలో కొన్ని మార్పులు చేయడమే కాక స్వయంగా ఆడి పాడారు. హిందీలో పాడిన ఈ పాట కోసం అమృత ఎరుపు రంగు టైట్ ప్యాంట్, టీ షర్ట్.. దాని మీద తెలుపు రంగు షర్ట్ ధరించారు.
(చదవండి: ‘మణికే మాగే హితే’ యొహానీకి బాలీవుడ్ బంపర్ ఆఫర్)
అమృత గాత్రం, ఆమె ఎక్స్‌ప్రెషన్స్ అన్ని సూపర్‌గా ఉన్నాయి. కానీ ఆమె ధరించిన బట్టలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. మాజీ సీఎం భార్య.. అంటే ఎంత పద్దతిగా ఉండాలి.. మరీ ఇంత అతి అవసరం లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు.
చదవండి: పెళ్లిలో డ్యాన్స్‌తో దుమ్మురేపిన వదిన.. అందరి చూపు ఆమె వైపే