ముంబై: సంక్షోభం అంచునకు మహారాష్ట్ర రాజకీయం చేరుకుంది. శివ సేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో దాదాపు మైనార్టీ దిశగా అడుగులు వేస్తోంది ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం. ఈ క్రమంలో.. సీఎం ఉద్దవ్ థాక్రేపై మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
ఏక్ థా కపటి రాజా.. అంటూ ‘థా’ అనే పదానికి స్పెషల్‌గా కోట్స్ మెన్షన్ చేసింది ఆమె. అది థాక్రేను ఉద్దేశించిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. విమర్శలు వెల్లువెత్తడంతో కాసేపటికే ఆమె ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు.
మహా వికాస్ అగాఢి కూటమి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని, కాంగ్రెస్.. ఎన్సీపీతో దోస్తీ కట్ చేసుకోవాలని, బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని 40 మంది ఎమ్మెల్యేలతో(అందులో ఇతరులు కూడా ఉన్నారు) కలిసి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు బావుటా ఎగరేశారు. అయితే షిండేకు, బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకుండా.. అసెంబ్లీనే రద్దు చేసే యోచనలో ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment