![Taapsee Pannu's befitting reply to a slut shame tweet deserves all the applause - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/20/tapsee.jpg.webp?itok=qVBvC5e5)
తాప్సీ ట్విట్టర్‌లో ఓ ఫొటో పెట్టారు. మీరు చూస్తున్నదదే. కొందరికి ఈ ఫొటో తప్పుగా కనిపించింది. ‘ఇటువంటి ఫొటోల వల్లనే అమ్మాయిల పట్ల మగాళ్లు ఆకర్షణకు లోనవుతారు. మళ్లీ హెరాస్‌మెంట్’ అని ఎవరో ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. వెంటనే తాప్సీ ‘అటువంటప్పుడు ఆ మగాళ్లందరూ రోగం (తప్పుగా చూసే ధోరణి) కుదరడానికి ఏదో ఒకటి చేయాలి.
అంతే తప్ప... ఇటువంటి ఫొటోల వల్ల ఏం కాదు. సర్లేగానీ... త్వరగా కోలుకో’’ అని కౌంటర్ ఇచ్చారు. మరో ఇద్దరు ముగ్గురు తాప్సీని కామెంట్ చేయగా... వాళ్లకూ తిక్క కుదిరే సమాధానాలు ఇచ్చారు. అన్నట్టు... గతంలో తాప్సీ బికినీ ఫొటోలపై కొందరు కామెంట్ చేయగా, సేమ్ టైప్ ఆన్సర్స్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment